Wednesday, December 6, 2023

చంద్రబాబు స్కిల్డ్ క్రిమినల్ – పురందేశ్వరీ బీజేపీలో టిడిపి కోవర్టు – విజ‌య‌సాయి రెడ్డి..

ఒంగోలు, సెప్టెంబర్ 12: చంద్రబాబు స్కిల్డ్ క్రిమినల్ (నైపుణ్యం కల్గిన నేరస్తుడు), ఆయన స్వతహాగా నేర ప్రవృత్తి కల్గిన వ్యక్తి, విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచే నేర స్వభావం అలవర్చుకున్న వ్యక్తి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దక్షిణ కోస్తా జిల్లాల ఇన్చార్జ్, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి అన్నారు. జ్యుడీషియరీతో పాటు అన్ని కీలక వ్యవస్థల్లో తన మనుషులను పెట్టి వ్యవస్థలన్నింటికీ బ్రష్టుపట్టించిన వ్యక్తి చంద్రబాబని అన్నారు. ఒంగోలులో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పిలపునిచ్చిన బంద్ కు కనీస స్పందన కరువయ్యిందని, చంద్రబాబు కంపెనీ హెరిటేజ్ కూడా స్పందించలేదని అన్నారు. తన అరెస్టుపై రాష్ట్రంలో  ఎవ్వరూ స్పందించంలేదని భావించి ఇతర రాష్ట్రాలకు తన ప్రతినిధులను పంపించి అక్కడ నాయకులతో సామాజిక మాద్యమాల్లో స్పందించాలని వేడుకునే దౌర్బాగ్య స్థితికి దిగజారిపోయాడని అన్నారు.  

- Advertisement -
   

సీమెన్స్ ఓ మల్టీనేషనల్ కంపెనీ, 90 శాతం వాటా ఇస్తుందో లేదో తెలియకుండానే రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 10 శాతం షెల్ కంపెనీల ద్వారా రూ.370 కోట్లు తన బినామీ అకౌంట్లకు మళ్లించుకున్నాడని సీఐడీ కోర్టు ముందు ఉంచిందని అన్నారు. చంద్రబాబు కుంభకోణాన్ని రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ సీఐడీ  మాత్రమే కాదని కేంద్ర ప్రభుత్వ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీలు ఈడీ, ఐటీలు నేరుగా వెల్లడించాయని అన్నారు. 90 శాతం వాటా ఇస్తామని తాము ఎవ్వరితోనూ చెప్పలేదని సీమెన్స్ కంపెనీ ప్రతినిధులు స్పష్టం చేశారని చెప్పారు. చంద్రబాబు సచ్చీలుడు, అవినీతికి పాల్పడలేదు, అంతర్జాతీయ స్థాయి నాయకుడు అంటూ ప్రజలను నమ్మించేందుకు ఓ వర్గం మీడియా ఎంతగా ప్రయత్నించినప్పటికీ పూర్తిగా విఫలమయ్యిందని అన్నారు. అది జీర్ణించుకోలేక భూమి, ఆకాశం కదిలించే ప్రయత్నం చేస్తోందని అన్నారు. చంద్రబాబు 14 ఏళ్ల ముఖ్యమంత్రి చరిత్ర మొత్తం స్కాంలతోనే నింపిపోయిందని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి పేరుతో ఇన్సైడర్ ట్రేడ్ చేశాడని అలాగే ఏలూరు రిజర్వాయర్, ఐఎంజీ భారత్, అమరావతి నిర్మాణం, పోలవరం హౌసింగ్, స్కిల్ కుంబకోణం అన్ని స్కాంలకు చంద్రబాబే ప్రధాన సూత్రధారి అని అన్నారు.

బహిరంగ చర్చకు సిద్ధం

చంద్రబాబు నీతిమంతుడు అని ఎవ్వరూ అనుకోవడం లేదని, సచ్చీలుడని ఎవరైనా వాదిస్తే తాను బహిరంగ చర్చకు సిద్ధమని విజయసాయి రెడ్డి ఛాలెంజ్ విసిరారు. వ్యవస్థలన్ని మేనేజ్ చేసుకుంటూ కేసులపై స్టేలు తెచ్చుకొని బ్రతుకుతున్నాడని, ఆదాయానికి మించి ఆస్థులు లేదని చంద్రబాబు భావిస్తే స్టే వెకేట్ చేయించి దర్యాప్తు ఎదుర్కోవాలని ఛాలెంజ్ విసిరారు. చంద్రబాబు స్వతహాగా ఛరిష్మాలేదని, ప్రజాధరణ లేదని, నాయకత్వ లక్షణాలూ లేవని అన్నారు. సామాన్యుడు రాజకీయాల్లోకి రాకుండా ఓటుకు నోటుతో డబ్బుతో రాజకీయాలకు బ్రష్ట పట్టించిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. ఆయన చేయని దారుణాలు లేవని అన్నారు. చంద్రబాబు నేర స్వభావం కొనసాగంచడానికి చెరుకూరి రామయ్య అలియాస్ రామోజీ ఒక కారకుడని అన్నారు. బాబు చేసిన ప్రతి తప్పునూ కప్పిపుచ్చి ఆయనను ఓ గొప్ప విజనరీగా రామోజీ చూపించాడని, అదే ఈ రోజు చంద్రబాబుకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపేలా చేసిందని అన్నారు. చంద్రబాబుతో పాటు రామోజీ సైతం అనేక నేరాల్లో పాత్రధారి అని ఆతనిపైనా విచారణ జరగాలని అన్నారు. స్కిల్ స్కాంలో లోకేష్ అతని అనుచరుడు కిలారి రాజేష్ పాత్ర ఉందని అది నిరూపణ జరిగితే చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.   

పురందేశ్వరి బీజీపీలో తేదేపా కోవర్టు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తెలుగుదేశం పార్టీకి కోవర్టు అని అన్నారు. పురందేశ్వరితో పాటు బీజేపీలో మరికొంత మంది తేదేపా కోవర్టులు ఉన్నారని అన్నారు. జనసేన పార్టీ ప్రస్తుతం బీజేపీ పార్టీతో ఉన్నా భవిష్యత్ లో తెదేపాతో కలిసి పనిచేస్తుందని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు.

ఒంగోలులో 8 నియోజకవర్గాల్లో వైకాపా విజయం తధ్యం

గతంలో పోగొట్టుకున్న కొండేపి నియోజకవర్గంతో పాటు ఒంగోలు జిల్లాలో నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని విజయసాయి రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల అన్ని జిల్లాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నామని అన్నారు.  అనంతరం నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తామని అన్నారు. అందులో భాగంగా రెండు రోజులు పాటు ఒంగోలు జిల్లాలో సమావేశాలు నిర్వహించామని అన్నారు. ఒంగోలు జిల్లాలో పార్టీ బలంగా ఉందని, చిన్న చిన్న అభిప్రాయబేధాలు సహజమేనని త్వరలోనే సమసిపోతాయని అన్నారు. భిన్నాభిప్రాయాలను ఏకాభిప్రాయంగా చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలో బాలినేని వాసు బలమైన నాయకుడని ఆయన ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు జరుగుతాయని, నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.  అలాగే వలంటీర్లు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారధులుతో సమావేశాలు నిర్వహించనున్నామని అన్నారు. పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయమే తుది నిర్ణయమని, అది ఆయనే  అభ్యర్థులను  ప్రకటిస్తారని విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.ప్రకాశం జిల్లానాయకులు ఈ పత్రిక సమావేశంలో పాల్గొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement