Friday, October 4, 2024

AP: యువతిపై అత్యాచారం కేసులో తీర్పు.. ఇద్ద‌రు నిందితులకు 20 ఏళ్ల జైలు, 10వేల జ‌రిమానా

యువతిపై అత్యాచారం కేసులో ఇద్దరు నిందితులకు 20 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ కర్నూలు మహిళా కోర్టు జడ్జి ఇవ్వాల (బుధవారం) తీర్పునిచ్చారు. దీనికి సంబంధించిన‌ వివరాలిలా ఉన్నాయి. కల్లూరు మండలం ఉలిందకొండ గ్రామానికి చెందిన ఎల్లన్న, కర్నూలు మండలం వెంకాయ పల్లె గ్రామానికి చెందిన శివ కళాధర్ అనే ఇద్ద‌రు వ్యక్తులు 2016లో
ఓ యువతి పై ఆత్యాచారం చేసినట్లు అప్పట్లో కర్నూలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది.

ఈ కేసుపై దాదాపు ఏడేళ్ల పాటు న్యాయ‌స్థానంలో విచారణ కొనసాగింది. నిందితులపై నేరం రుజువు కావడంతో కర్నూలు మహిళా కోర్టు జడ్జి నిందితులకు శిక్షణ ఖరారు చేస్తూ ఇవ్వాల‌ తీర్పునిచ్చారు. ఈ కేసులోని ఇద్దరు నిందితులకు 20సంవత్సరాల జైలు శిక్షతో పాటు 10వేల రూపాయల జరిమానా కూడా విధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement