Tuesday, October 15, 2024

AP: వంగవీటి రంగా సతీమణికి తీవ్ర అస్వస్థత

మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా భార్య, మాజీ ఎమ్మెల్యే రత్నకుమారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆమెను విజయవాడలోని హెల్ప్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు.

విషయం తెలిసిన రంగా అభిమానులు భారీ ఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకుంటున్నారు. మరోవైపు ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ కూడా ఆస్పత్రికి చేరుకుని ఆమె ఆరోగ్య ప‌రిస్థితిపై వైద్యుల‌ను అడిగి తెలుసుకున్నారు.. ఆమె కుమారుడు రాధ హాస్ప‌ట‌ల్ లోనే ఉండి ప్ర‌తిక్ష‌ణం త‌ల్లి ఆరోగ్యంపై డాక్ట‌ర్ల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement