Saturday, May 4, 2024

TTD | భక్తులకు అందుబాటులో టీటీడీ డైరీలు, క్యాలెండర్లు

తిరుమల, ప్రభ న్యూస్‌ ప్రతినిధి: : టీటీడీ ముద్రించిన 2024 సంవత్సరం డైరీలు, క్యాలెండర్లు తిరుమల-తిరుపతిలోని అన్ని టీటీడీ పుస్తక విక్రయశాలల్లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా టిటిడి వెబ్‌సైట్‌ ద్వారా 12 పేజీల క్యాలెండర్లు, డైరీలు, టేబుల్‌టాప్‌ క్యాలెండర్లను భక్తులు కొనుగోలు చేయవచ్చు.

ధరల వివరాలు ఇలా..

- Advertisement -

12 పేజీల క్యాలెండర్‌ రూ.130, డైరీ (డీలక్స్‌) రూ.150, డైరీ (చిన్నది) రూ.120, టేబుల్‌టాప్‌ క్యాలెండర్‌ రూ.75, 6 పేజీల క్యాలెండర్‌ రూ.450, శ్రీవేంకటేశ్వరస్వామివారి పెద్ద క్యాలెండర్‌ రూ.20, శ్రీవారు మరియు శ్రీపద్మావతి అమ్మవారి క్యాలెండర్‌ రూ.15, శ్రీపద్మావతి పెద్ద క్యాలెండర్‌ రూ.20, తెలుగు పంచాంగం క్యాలెండర్‌ రూ.30

బయటి ప్రాంతాల్లో..

చెన్నైలోని శ్రీవేంకటేశ్వరస్వామి, శ్రీపద్మావతి అమ్మవారి ఆలయాలు, హైదరాబాద్‌, బెంగళూరు, విజయవాడ, వైజాగ్‌లోని శ్రీవారి ఆలయాలు, ముంబయి, న్యూఢిల్లిd, వేలూరు, కాంచీపురంలోని సమాచార కేంద్రాలు, నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూలులోని టిటిడి కళ్యాణ మండపాల్లో క్యాలెండర్లు, డైరీలు విక్రయాల కోసం అందుబాటులో ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement