Friday, May 3, 2024

కరోనా కట్టడికి టీటీడీ కొత్త రూల్స్…

కోవిడ్ 19 రెండవ విడత వ్యాప్తి నేపథ్యంలో భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా టీటీడీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. భక్తులపై కరోనా ఆంక్షలు విధించింది. జ్వరం, దగ్గు, జలుబు ఉన్న భక్తులు.. శ్రీవారి దర్శనానికి రావొద్దని విజ్ఞప్తి చేసింది. పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రకాల దర్శనాలకు 45వేల మందికే ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలియజేశారు.

టీటీడీ మార్గదర్శకాలను పాటిస్తూ భక్తులు స్వామివారి దర్శనం చేసుకోవాలని కోరుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, శ్రీవారి ఆలయం, అన్న ప్రసాద కేంద్రం, కళ్యాణ కట్ట తో పాటు రద్దీగా ఉండే ప్రాంతాల్లో భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. సర్వ దర్శనం టోకెన్లను 22 వేల నుంచి 15 వేలకు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది. ఇక సర్వదర్శనం టోకెన్లు తగ్గించిన విషయాన్ని ఇతర రాష్ట్రాల భక్తులు దృష్టిలో ఉంచుకోవాలని టీటీడీ తెలియజేస్తుంది.తిరుమలకు వచ్చే భక్తులు తమ వెంట తప్పనిసరిగా మాస్కులు, శానిటైజర్ లు తెచ్చుకోవాలని టీటీడీ ఆదేశాలు జారీ చేసింది.

ఇక తలనీలాలకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని కొట్టిపారేశారు టీటీడీ అదనపు ఈవో. తలనీలాల నిల్వ, వేలం, తరలింపునకు సంబంధించి టిటిడిలో పటిష్టమైన వ్యవస్థ ఉంది. తలనీలాలు దుర్వినియోగమయ్యే అవకాశమే లేదని తెలిపారు. ఇ-వేలంలో పొందిన బిడ్డర్ కు తలనీలాలు అప్పగించడం వరకే టీటీడీ బాధ్యత. తలనీలాల తరలింపునకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం అవాస్తవం. ఈ విషయమై మిజోరాం పోలీసులను, అస్సాం రైఫిల్స్ పోలీసులను సంప్రదించాం. ఈ కేసు మూలలను గుర్తించేందుకు పోలీసులు విచారణ జరుపుతున్నారని టీటీడీ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement