Friday, May 3, 2024

ఖైదీల‌కు నిజమైన స్వాతంత్ర్యం.. మంచి ప్ర‌వ‌ర్త‌న‌తో విడుద‌ల చేసిన ఏపీ స‌ర్కారు

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను ఏపీ ప్రభుత్వం ఇవ్వాల (సోమ‌వారం) విడుదల చేసింది. రాష్ట్రంలోని వివిధ జైళ్ల నుంచి మొత్తం 175 మంది ఖైదీలను విడుదల చేస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయం వల్ల ముందే విడుదలైన వారిలో జీవితఖైదు పడిన 48 మంది ఖైదీలున్నారు. సత్ప్రవర్తన కారణంగా విడుదలైన ఖైదీల్లో అత్యధికులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు చెందినవారే.

రాజమండ్రి జైలు నుంచి 66 మంది విడుదల కాగా, వారిలో 55 మంది పురుషులు, 11 మంది మహిళలున్నారు. విశాఖ సెంట్రల్ జైలు నుంచి 40 మంది విడుదలయ్యారు. వారిలో 33 మంది జీవితఖైదు పడినవారున్నారు. కాగా, నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి 25 మంది ఖైదీలు ప్రభుత్వ ఉత్త‌ర్వుల‌తో విముక్తి పొందారు. జైల్లో కనబర్చిన సత్ప్రవర్తననే బయట కూడా కనబర్చాలని, ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా మ‌ళ్లీ లోప‌లేస్తామ‌ని అధికారులు హెచ్చ‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement