Thursday, April 25, 2024

AP: ఇడుపులపాయలో వైఎస్ఆర్ కు జ‌గ‌న్ నివాళి

వైసీపీ అధినేత జగన్ ఇడుపులపాయకు చేరుకున్నారు. ఆయన వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళుర్పించారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అయితే వైఎస్ జగన్ వెంట జగన్ కుటుంబ సభ్యులు, పార్టీ నేతలతో పాటు వైఎస్ విజయమ్మ కూడా పాల్గొన్నారు.

జగన్ నేటి నుంచి ఎన్నికల ప్రచార యాత్రకు సిద్ధమవుతున్నారు. మేమంతా సిద్ధం అనే పేరుతో ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ ఆయన 21 రోజుల పాటు యాత్ర చేయనున్నారు. రెండోసారి అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో ఆయన ఈరోజు యాత్రకు బయలుదేరారు. అయితే ఇడుపులపాయకు విజయమ్మ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement