Wednesday, May 15, 2024

trains  canceled : ఏపీలో ప‌లు రైళ్లు ర‌ద్దు

ఏపీలో కొరాపుట్‌-రాయగడ సెక్షన్‌లో భద్రతాపరమైన పనులు జరుగుతుండటంతో పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్నింటి దారి మళ్లించి తిప్పుతున్నారు. ఇవాళ , మే 3, 6 తేదీల్లో విశాఖ-కొరాపుట్‌(18512), ఈ నెల 30, మే 4, 7 తేదీల్లో కొరాపుట్‌-విశాఖ(18511) బైవీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రద్దయ్యాయి.

- Advertisement -

ఏప్రిల్‌ 28 నుంచి మే 8వ తేదీ వరకు విశాఖ-కొరాపుట్‌(08546), ఏప్రిల్‌ 28 నుంచి మే 9 వరకు కొరాపుట్‌-విశాఖ(08545) రైళ్లు రాయగడ వరకు నడుస్తాయి. తిరుగు ప్రయాణంలో రాయగడ నుంచే బయలుదేరుతాయి. అలాగే ఈ నెల 28వేతదీ ఉదయం 10.15 గంటలకు బయలు దేరాల్సిన ఎస్‌ఎంవీ బెంగళూరు-జాషిది (22305) ఎక్స్‌ప్రెస్‌ 29వ తేదీ ఉదయం 6.45 గంటలకు బయలుదేరనుంది.

విజయవాడ- కాజీపేట మార్గంలో ఇంజినీరింగ్‌ పనులు జరుగుతుండటంతో కొన్ని రైళ్లను బీబీనగర్, నల్గొండ, నడికుడి, పిడుగురాళ్ల, గుంటూరు మీదగా తిప్పుతున్నారు. విశాఖపట్నం ఎల్‌టీటీ- విశాఖపట్నం (18519)/(18520) రైలు ఈనెల 29 నుంచి మే 9వ తేదీ వరకు, తిరిగి మే 15 నుంచి 21వ తేదీ వరకు బీబీనగర్, నల్గొండ, నడికుడి, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా నడవనుంది.

షాలిమార్‌- హైదరాబాద్‌- షాలిమార్‌ (18045)/ (18046) మే 2, 3, 8, 9, 20, 21 తేదీల్లో గుంటూరు మీదుగా రాకపోకలు సాగిస్తుంది. సికింద్రాబాద్‌- షాలిమార్‌- సికింద్రాబాద్‌ (07225)/07226) ఈనెల 29, మే 6, 20 తేదీల్లో సికింద్రాబాద్‌ నుంచి గుంటూరు మీదుగా విజయవాడ వెళుతుంది. ప్రయాణికులు ఈ మార్పులను దృష్టిలో ఉంచుకొని ప్రయాణానికి అనువుగా మార్పులు చేసుకోవాలని అధికారులు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement