Wednesday, May 1, 2024

Tirumala : బాల‌కృష్ణ బ‌ర్త్ డే.. 630కొబ్బ‌రికాయ‌లు మొక్కు

తిరుపతి సిటీ ..ప్రభ న్యూస్ : తిరుమలలో అఖిలాండం వద్ద సినీ నటుడు నందమూరి బాలకృష్ణ 63వ జన్మదిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ 630 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఆయన పేరుతో అర్చన నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్ వర్మ మాట్లాడుతూ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరము అఖిలాండ వద్ద మొక్కులు తీర్చుకోవడం జరుగుతుందని వివరించారు. ఆయన మరిన్ని ప్రజాసేవ కార్యక్రమాలు చేయడంతో పాటు ఆయురారోగ్యాలు.. సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాన‌ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ అభిమాని సుబ్రమణ్యం పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement