Monday, April 29, 2024

భక్తులతో కళకళలాడుతున్న తిరుమల క్షేత్రం.. మళ్లీ పూర్వపు వైభవం..

కోటాను కోట్ల మంది భక్తులు కలిగిన కలియుగ ప్రత్యక్ష దైవమైన వేంకటేశ్వరుడికి భక్తి ప్రపత్తులతో భక్తులు సమర్పిస్తున్న కానుకలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. గడిచిన రెండేళ్లు కొవిడ్ తో సందడి లేని తిరుమలలో ప్రస్తుతం మునుపటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ 90 రోజులు చూస్తే ఏ రోజు 3 కోట్ల రూపాయ‌ల‌కు తగ్గకుండా ఆ దేవదేవునికి భక్తులు సమర్పించే హుండీ కానుకల ద్వారా ఆదాయం సమకూరుతుంది. వడ్డీ కాసులవాడి హుండీ కళకళలాడుతోంది.

అఖిలాండ కోటి బ్రహ్మండనాయకుడైన శ్రీవారి దర్శనార్దం ప్రపంచం నలుమూలల నుండి భక్తులు తిరుమలకు వస్తున్నారు. కొవిడ్‌ తీవ్రత తగ్గడంతో ఏడు కొండలకు భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో తిరుమల క్షేత్రం భక్తులతో భక్తులతో కళకళ లాడుతోంది. గతంలో వారాంతపు రోజులలో, విశేష పర్వదినాలలో మాత్రమే రద్దీ అధికంగా ఉండేది. ఆ రోజుల్లో మాత్రమే హుండీ ఆదాయం ఎక్కువ వచ్చేది. అయితే ప్రస్తుతం భక్తుల రద్దీకి సంబంధం లేకుండా హుండీ కానుకలు మాత్రం 3 కోట్లకు పైగా వ‌స్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement