Friday, May 3, 2024

Breaking: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఉరుములు, మెరుపులతో వర్షం

రాపూరు: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఇవ్వాల (ఆదివారం) సాయంత్రం వెద‌ర్ ఒక్క‌సారిగా చేంజ్ అయ్యింది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాపూరు మండ‌లంలో సాయంత్రం నుంచి మోస్త‌రు జల్లులు కురుస్తుండ‌గా.. ఉరుములు మెరుపులు జ‌నాల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురిచేస్తున్నాయి. సాయంత్రం 7 గంటల వరకు వేడి, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోయారు. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షం మొద‌లైంది. రాపూరు, పెంచలకోన నర్సింహస్వామి క్షేత్రంలో పలు చెట్లు గాలివానకు నేల కూలాయి. అంతేకాకుండా ఈదురుగాలులకు ప‌లు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement