Saturday, May 11, 2024

Ap | బ్యారేజీని పోటెత్తిన‌ వరద నీరు.. పొంగిపొర్లుతున్న కృష్ణమ్మ

ఎన్టీఆర్ బ్యూరో, (ప్రభ న్యూస్) : కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తోడు వాగులు, వంకల నుండి పెద్ద ఎత్తున వస్తున్న వరద నీరు ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ కి పోటెత్తుతోంది. మూడు రోజుల నుండి గంట గంటకు పెరుగుతూ వస్తున్న వరద ప్రవాహంతో ప్రకాశం బ్యారేజీ నిండుకుండను తలపిస్తోంది. మ్యారేజి నీటి నిల్వ సామర్థ్యం 3.07 టీఎంసీల కు చేరుకోవడంతో అధికారులు ప్రస్తుతం 12 అడుగుల నీటిమట్టాన్ని ఉంచుతూ మిగులు జలాలని దిగువకు వదులుతున్నారు.

బ్యారేజి 70 గేట్లలో 25 గేట్లను నాలుగు అడుగుల మేర, 45 గేట్ల‌ను 3 అడుగుల మేర ఉంచి సాగరంలోకి మిగులు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి గురువారం రాత్రి తొమ్మిది గంటల సమయానికి 1,82,000 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో అవుట్ ఫ్లో గా ఉంది. బ్యారేజీ నుండి పెద్ద ఎత్తున వరద నీరు దిగువ ప్రాంతాలకు వెళుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు కృష్ణానది దిగువ ప్రాంతాల్లో ఉన్న నదీ పరివాహక ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement