Saturday, April 27, 2024

AP: పార్లమెంట్ ఎన్నికలపై 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రభావం… సీపీఐ నేత డి.రాజా

రాబోయే పార్లమెంటు ఎన్నికలపై ఇప్పుడు జరిగే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ప్రభావం చూపుతుందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. ఏపీ పర్యటనలో పర్యటనలో ఉన్న ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ… బీజేపీ హటావో… దేశ్ బచావో.. అనే నినాదంతో ముందుకెళ్తామన్నారు. ప్రధాని మోడీ ప్రతిపక్షాల మీద తప్పుడు విధానాలు అనుసరిస్తున్నారన్నారు. మిజోరాం, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, రాజస్థాన్, తెలంగాణలలో ఎన్నికలు జరుగుతున్నాయి.. మోడీ పాలనా వైఫల్యాలను ప్రజలు గమనించారని తెలిపారు. పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలలో మోడీ పాలనా వైఫల్యాలు ప్రతిభింబిస్తాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మైనారిటీల పట్ల బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అసమానతలు ఉన్నాయన్నారు. అన్ని సెక్యులర్ పార్టీలు కలిసి బీజేపీని గద్దె దించాలన్నారు. ఇండియా కూటమి రోజు రోజుకు బలపడుతోందన్న ఆయన.. మోడీ పాలనలో చేసిన పనులన్నీ వైఫల్యాలే… ఆకలితో అలమటిస్తున్న వారు భారతదేశంలో ఎక్కువైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

అదానికి భారతదేశంలో ఉన్న పోర్టులు అప్పజెప్పారని రాజా మండిపడ్డారు. నిరుద్యోగ యువత పెరిగిపోయారు.. వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఆయన మాట్లాడుతూ.. కొత్తగూడెంలో జనసమూహం అత్యధికంగా వచ్చారని తెలిపారు. అయితే, సీపీఐ, సీపీఎం ఒకసారి కూర్చొని మాట్లాడుకోవాలని సూచించారు. ఇక, చంద్రబాబు ఆరోగ్య పరిస్ధితి గురించి అడిగి తెలుసుకున్నానని.. చంద్రబాబు అరెస్టుపై నిజాలు నెమ్మదిగా బయటకి వస్తాయని వెల్లడించారు.. చంద్రబాబు తనకు దశాబ్దాలుగా పరిచయం ఉందని గుర్తుచేసుకున్నారు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా.

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ… దొంగల రాజ్యం ఈ రాష్ట్రంలో నడుస్తోందన్నారు. రాష్ట్రంలో ఇసుక, మద్యం దోపిడీ పెద్ద ఎత్తున జరుగుతోందన్నారు. 26 జిల్లాల్లో యధేచ్ఛగా వేల కోట్ల రూపాయల ఇసుక దోపిడీ జరుగుతున్నదన్నారు. రకరకాల పేర్లతో మద్యం సొంత బ్రాండ్లు అమ్మిస్తున్నారన్నారు. హైకోర్టు స్పష్టంగా అమరావతి రాజధానిగా అభివృద్ధి చేయాలని చెప్పినా.. వినకుండా సుప్రీంకోర్టుకు వెళ్ళారన్నారు. 450 కోట్ల రూపాయలతో రిషికొండపై ఇల్లు కట్టడానికి అది మీ అబ్బా సొమ్మా అని జగన్ ను ప్రశ్నిస్తున్నామన్నారు. ఇందులో 150 కోట్ల అవినీతి జరిగిందన్నారు. ఉపాధ్యాయులను బెదిరించేందుకు జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారన్నారు. ఓటర్ల చేర్పులో చాలా అక్రమాలు జరిగాయన్నారు. ఎన్నికల విధుల్లో టీచర్లను పాల్గొననీయకుండా కుట్ర చేస్తున్నారన్నారు. ఆన్ని రాజకీయ పక్షాలు జగన్ సర్కార్ విధానాలపై ప్రశ్నించాలన్నారు. గవర్నర్ కు దీనిపై ఫిర్యాదు చేస్తామని రామకృష్ణ అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement