Thursday, May 2, 2024

AP: బడుగు వర్గాలకు పెద్దపీట వేసిన సీఎం జగన్ .. సజ్జల

ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో : ఉన్నత వర్గాల వారి కంటే బుడుగు బలహీన వర్గాలకు పెద్ద పీట వేస్తున్న గొప్ప నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. క్యాబినెట్ లో 70% మంది ఇతర కులాల వారు ఉన్నారని, కార్పోరేషన్ చైర్మన్ లు కూడా బలహీన వర్గాలకే ఎక్కువ ఇచ్చారన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాల అనుగుణంగా సీఎం జగన్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. అసెంబ్లీలో బేడ జంగం కులాన్ని తిరిగి ఎస్సీ జాబితాలో చేర్చి కేంద్రానికి ముఖ్యమంత్రి జగన్ పంపడాన్ని స్వాగతిస్తూ ఆంధ్రప్రదేశ్ బేడ జంగం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎలుమర్తి మధు ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం కృతజ్ఞత సభ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం జగన్ పెద్ద మనసు వలన ఎవరికి ఏ సమస్య వచ్చినా భరోసా ఇవ్వగలుగుతున్నామని చెప్పారు. సీఎం జగన్ దగ్గరకు ఎవరు యాచిస్తూ రావాల్సిన అవసరం లేదని, హక్కుగా రావచ్చని తెలిపారు. గత ప్రభుత్వాలు ఎస్సీ, బీసీల అభ్యున్నతి కోసం ఎటువంటి కృషి చేయలేదని, కానీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారని తెలిపారు. ఈ మూడు కులాలను ఎస్సీల జాబితాలో చేర్చేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి అందరి వాడని, ప్రతి ఒక్కరూ రాజకీయంగా ఎదగాలన్నదే ఆయన ఆకాంక్ష అని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement