Friday, May 17, 2024

Temple Tour – నేడు శ్రీపెరుంబుదూరులో చంద్ర బాబు పర్యటన

చెన్నై: ఆలయాల సందర్శనల్లో భాగంగా తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు మంగళవారం కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూరుకు వస్తున్నట్లు చెన్నై నగర తెదేపా అధ్యక్షుడు చంద్రశేఖర్‌ తెలిపారు

అక్కడి శ్రీరామానుజర్‌ ఆలయాన్ని సందర్శించి పూజలు చేస్తారని అన్నారు. మధ్యాహ్నం 2.30కు హైదరాబాద్‌ బేగంపేట నుంచి విమానంలో బయలుదేరి చెన్నై విమానాశ్రయానికి చేరుకుంటారని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీపెరుంబుదూరు ఆలయాన్ని చేరుకుంటారని తెలిపారు. దర్శనం తర్వాత సాయంత్రం చెన్నై చేరుకుని రాత్రి 8.50కు విమానంలో విజయవాడ బయలుదేరనున్నట్లు వివరించారు.తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు మంగళవారం కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూరుకు వస్తున్నట్లు చెన్నై నగర తెదేపా అధ్యక్షుడు చంద్రశేఖర్‌ తెలిపారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement