Sunday, April 11, 2021

సీఎం జగన్ కి కృతజ్ఞతలు తెలిపిన తెలుగు ఫిలిం ఛాంబర్

క‌రోనా వైర‌స్ వ‌ల్ల తీవ్రంగా న‌ష్ట‌పోయిన తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చేయూత‌నివ్వాల‌ని ఏపీ సీఎం జ‌గ‌న్ తీసుకున్న ప‌లు నిర్ణ‌యాల ప‌ట్ల తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ హ‌ర్షం వ్య‌క్తం చేసింది. ఆయ‌న‌తో పాటు ఈ విష‌యంలో త‌మ‌కు స‌హ‌క‌రించిన సినీన‌టులు చిరంజీవి, అక్కినేని నాగార్జున స‌హా ప‌లువురికి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ ఫిలిం ఛాంబ‌ర్ నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌లైంది. ఏప్రిల్, మే, జూన్ నెల‌ల‌కు థియేట‌ర్ల యాజ‌మాన్యాలు చెల్లించాల్సిన ఫిక్స్‌డ్ కరెంట్ చార్జీల‌ను పూర్తిగా ర‌ద్దు చేస్తూ, మిగిలిన ఆరు నెల‌ల చార్జీల‌ను కూడా వాయిదాల్లో చెల్లించేందుకు జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకున్నార‌ని గుర్తు చేశారు. అలాగే, ప‌లు విష‌యాల్లో జ‌గ‌న్ త‌మ‌కు అనుకూలంగా నిర్ణ‌యం తీసుకున్నార‌ని ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News