Monday, April 29, 2024

Flash: ఏపీ అసెంబ్లీలో సేమ్ సీన్.. ఐదుగురు టీడీపీ సభ్యులు సస్పెన్షన్

ఏపీలో అసెంబ్లీ అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సభలో టీడీపీ సభ్యుల నినాదాలతో తరుచు సస్పెన్షన్ కి గురవుతున్నారు. తాజాగా ఈరోజు కూడా ఏపీ అసెంబ్లీ నుంచి ఐదుగురు టీడీసీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సస్పెన్షన్ చేశారు. రెండ్రోజులపాటు టీడీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

జంగారెడ్డి గూడెంలో సారా మరణాలపై చర్చించాలని పట్టు బడుతూ టీడీపీ సభ్యులు ఇవాళ అసెంబ్లీలో చిడతలు వాయిస్తూ నిరసన తెలుపడంతో స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసన సభా ఔన్నత్యాన్ని కాలరాస్తున్నారని, రోజురోజుకూ టీడీపీ సభ్యులు దిగజారుతున్నారని స్పీకర్‌ మండిపడ్డారు. మీరు శాసనసభ్యులే అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, జోగిరమేశ్‌ మాట్లాడుతూ విలువైన సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్న టీడీపీకి చెందిన  ఎమ్మెల్యేలను సస్సెండ్‌ చేయాలని కోరారు. ఎన్నికల తర్వాత టీడీపీ నేతలంతా చిడతలు వాయించు కోవాల్సిందేనని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఓర్వలేక నిరసనలు తెలుపుతున్నారని పేర్కొన్నారు. ఒక్క సమస్యను ఎన్ని రోజులు సాగదీస్తారని ప్రశ్నించారు. సభ్యుల హక్కు లను కాలరాస్తున్నారని ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement