Friday, April 26, 2024

జగన్ ఢిల్లీ పర్యటన స్వంత ప్రయోజనాల కోసమే… తెలుగుదేశం ఎమ్మెల్యేలు..

అమరావతి – సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వివరాలు బహిర్గతం చేయాలంటూ టీడీపీ సభ్యులు అసెంబ్లీ లో డిమాండ్ చేశారు.. . స్పీకర్ పోడియాన్ని చుట్టు ముట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు.. సీఎం వైఎస్‌ జగన్ ఢిల్లీ పర్యటనల వివరాలు బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు.. కాగా, సీఎం జగన్ ఢిల్లీ పర్యటనల వివరాలు సభ ముందు ఉంచాలంటూ టీడీపీ వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చింది.. సీఎం జగన్ చాలా సార్లు ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్‌షాను కలిసినా ఆ విషయాలు ప్రజలకు వెల్లడించడంలేదని.. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే సీఎం జగన్.. ఢిల్లీకి వెళ్లారు.. ఢిల్లీ పర్యటనలో ప్రధాని, హోం మంత్రితో భేటీ వివరాలను సభ ముందు ఉంచాలని పట్టుబట్టారు. ఢిల్లీ వెళ్లి ఏం సాధించుకొచ్చారంటూ నిరసన చేపట్టారు.. పోలవరానికి నిధులెంత తెచ్చారంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రత్యేక హోదా తెచ్చారా అంటూ నినాదాలు చేశారు.. వెనుకబడిన జిల్లాల ప్యాకేజీ ఏమైందంటూ నిరసన తెలిపారు. అప్పర్ భద్ర ఆపారా ? విశాఖ రైల్వేజోన్ తెచ్చారా అంటూ నిలదీశారు.. దీంతో సభాకార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తున్నారంటూ స్పీకర్ 11 మంది ఎమ్మెల్యేల‌ను సస్సెండ్ చేశారు..

అనంత‌రం టిడిపి ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లో నిర‌స‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. బాబాయ్ హత్య కేసులో సీబీఐ అడుగు ముందుకేస్తే సీఎంకు ఢిల్లీ గుర్తుకొస్తుంది. కేసుల మాఫీ కోసమే సీఎం ఢిల్లీ వెళ్లారని మాకున్న సమాచారం అంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక వైఎస్‌ జగన్ 18 సార్లు ఢిల్లీ వెళ్లి 31 రోజులు పాటు అక్కడ ఉన్నారని విమర్శించారు. అసలు ఎందుకు అన్నిసార్లు ఢిల్లీ వెళ్లారో ప్రజలెవ్వరికీ తెలియదన్నారు. ఇవాళ శాసనసభలో ఢిల్లీ పర్యటన వివరాలు చెప్పి తీరాలి.. కీలక బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే ఆదరా బాదరాగా ఢిల్లీ ఎందుకు వెళ్లారో ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

టిడిపి స‌భ్యులు అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లో మీడియాతో మాట్లాడుతూ,

- Advertisement -

“విభజనచట్టంలోని హామీలసాధనకోసమే జగన్ ఢిల్లీవెళ్లాడని అప్పులఅప్పారావు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో ఆవు కథ చెప్పాడు. ముఖ్యమంత్రి ఏపనిమీద ఢిల్లీ వెళ్తే మీకెం దుకు అని అప్పులఅప్పారావు మమ్మల్ని ప్రశ్నించాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హో దాలో 18సార్లు ఢిల్లీ వెళ్లాడు. ఏనాడూ దానిపై మేంసభలో మాట్లాడలేదు. కానీ ఇప్పుడు బడ్జె ట్ సమావేశాలుజరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు కాబట్టే తాము ఏం సాధించడానికి ఆయన ఢిల్లీ వెళ్లారో చెప్పాలంటూ వాయిదాతీర్మానం అందించాం. దానికి సమాధానం చెప్పకుండా బుగ్గన మమ్మల్ని తప్పుపట్టాడు. రాష్ట్రం కోసం, ప్రజల కోసం జగన్ ఢిల్లీ వెళ్తే, ఆ విషయం చెప్పడానికి బుగ్గనకు ఎందుకంత భయమని ప్రశ్నిస్తున్నాం.
శాసనసభలో జరిగే బడ్జెట్ సమావేశాలకంటే ముఖ్యమంత్రికి ఢిల్లీపర్యటనే ముఖ్యమా.. ఒక వేళ ముఖ్యమైతే ఏమిటంత ముఖ్యమో ఎందుకు చెప్పలేకపోతున్నారు. జగన్ ఢిల్లీ పర్యటన లన్నీ తనకేసులు మాఫీకోసం చేసినవే. వివేకానందరెడ్డి హత్య కేసు నుంచి బయటపడటానికే జగన్ మొన్నటికి మొన్న హుటాహుటిన ప్రత్యేకవిమానంలో ఢిల్లీవెళ్లాడు. కాదు..రాష్ట్రప్రయో జనాల కోసమే వెళ్లాలని ఆయన చెప్పగలడా? అదే అయితే, కేంద్ర్ర ప్రభుత్వంలో ఎవరితో ఏంమాట్లాడారో, రాష్ట్రానికి ఎన్నినిధులుసాధించారో, ఏసమస్యల్ని పరిష్కరించారో ముఖ్యమం త్రి ఎందుకు ధైర్యంగా బయటకు చెప్పడంలేదు? వివేకాను చంద్రబాబే చంపించాడని ప్రచారం చేసి, జగన్ గతఎన్నికల్లో లబ్ధిపొందాడు. వివేకా కుమార్తె డాక్టర్ సునీత కోర్టుని ఆశ్రయించబ ట్టే, హత్యకేసు విచారణ సీబీఐవరకు వెళ్లింది. వివేకాను చంపింది ఎంపీ అవినాశ్ రెడ్డేనని, సా క్ష్యాలతో సహా సీబీఐ బయటపెట్టబోతున్న తరుణంలో, అవినాశ్ ను అరెస్ట్ చేస్తారని తేలిపో యిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఢిల్లీపర్యటన ఎవరికైనా అనుమానాలురేకెత్తిస్తుంది. వివేకాహ త్యకేసులో ప్రధాననిందితుడిగా ఉన్న అవినాశ్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి నిన్నఢిల్లీలోనే తిర గడం దేనికి సంకేతం? తమ్ముడిని కాపాడటానికే ముఖ్యమంత్రి, నిన్నప్రధానమంత్రిని కలిశా రని ప్రజలంతా అనుకంటున్నారు. దానిపై జగన్ ఏంసమాధానం చెబుతారు? అంటూ టిడిపి స‌భ్యులు ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement