Friday, May 3, 2024

ఇళ్లు కట్టిస్తామని చెప్పి.. బెదిరింపులకు దిగడం ఏంటి?

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌పై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు మండిప‌డ్డారు. ఇళ్ల‌ నిర్మాణంలో మూడో ఆప్షన్ ఎన్నుకున్న లబ్ధిదారులకు వాలంటీర్ల నుంచి బెదిరింపులు ఎదుర‌వుతున్నాయ‌ని ఆయ‌న ఆరోపించారు. ‘ఇళ్ల‌ నిర్మాణంలో మూడో ఆప్షన్ ఎన్నుకున్న లబ్ధిదారులకు బెదిరింపులు. బలవంతంగా మొదటి రెండు ఆప్షన్ లలోకి, ఒప్పుకోకపోతే స్థలంకూడా రాదని వాలంటీర్ లతో హెచ్చరికలు. ఎన్నికలముందు మేమే ఇళ్లు కట్టిస్తామని చెప్పి మోసంచేసి.. నేడు మాపై బెదిరింపులకు దిగడం ఏంటి? అంటున్న పేదలకు సమాధానం చెప్పండి’ వైఎస్ జ‌గ‌న్ అని దేవినేని ఉమ నిల‌దీశారు.

‘’ఉపాధిహామీ డబ్బుల చెల్లింపుల్లో ప్రభుత్వం కిరికిరీ. చెల్లించామని అసత్యాలు చెప్తూ.. ఇవ్వొద్దని అధికారులకు హుకుం. పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించకుండా వేధింపులు. చెల్లింపుల్లో పెద్దఎత్తున మామూళ్ల వసూళ్ళకు తెరలేపిన మీ ప్రజాప్రతినిధులపై ఏం చర్యలు తీసుకుంటారు? ‘’ అంటూ సీఎం జగన్ ను దేవేనేని ఉమ ప్రశ్నించారు.

ఇది కూడా చవండిః మన్యం వీరుడు అల్లూరి దాడికి వందేళ్లు

Advertisement

తాజా వార్తలు

Advertisement