Monday, April 29, 2024

అసెంబ్లీకి కాలిన‌డ‌క‌న టీడీపీ అధినేత చంద్ర‌బాబు

మాజీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకుంటోందని ఆరోపిస్తూ, ఏపీ నిత్యావ‌స‌ర ధ‌ర‌ల పెరుగుద‌ల‌ను నిర‌సిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేతృత్వంలో త‌మ‌ పార్టీ ఎమ్మెల్యేలు కాలిన‌డ‌క‌న‌ అసెంబ్లీకి వెళ్లారు. అంత‌కు ముందు వెంక‌ట‌పాలెంలో ఎన్టీఆర్ విగ్ర‌హానికి చంద్ర‌బాబు పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు.

అనంత‌రం అక్క‌డి నుంచి పెరిగిన ధరలను త‌గ్గించాల‌ని ప్ల‌కార్డుల‌తో ప్రభుత్వంపై నిరసన తెలిపారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. చెత్తపై పన్ను వేసిన చెత్త ప్రభుత్వం అంటూ ఆయ‌న‌ మండిపడ్డారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు, కరెంట్ చార్జీల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా వసూలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. నిత్యావసరాల ధరలు భారీగా పెరిగి.. జీవన ప్రమాణాలు పడిపోయే స్థితికి వచ్చిందని విమర్శించారు. పెరిగిన పన్నుల భారం, ధరాభారంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement