Monday, May 6, 2024

AP | అంటువ్యాధులు ప్రభలకుండా కుట్టుదిట్టమైన చర్యలు తీసుకోండి : సిఎస్

అమరావతి: రాష్ట్రంలో ఎక్కడా మురికి నీరు, పారిశుధ్య లోపం వల్ల డయేరియా వంటి అంటువ్యాధులు ప్రబలకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్. జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గుంటూరు నగరంలో ఇటీవల డయేరియా వ్యాధి ప్రబలిన నేపథ్యంలో చేపట్టిన చర్యలపై శుక్రవారం ఆయన వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. ప్రస్తుత వేసవిలో అంటువ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య, మున్సిపల్ శాఖల అధికారులను ఆదేశించారు. ఇందుకోసం గ్రామ వార్డు సచివాలయాలను పూర్తి స్థాయిలో సమకూర్చి తగు చర్యలు తీసుకోవాలని సీఎస్ జవహర్ రెడ్డి అన్నారు. డ్రైన్ల గుండా వెళ్లే తాగునీటి పైపులను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి లీకేజీలు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement