Sunday, June 30, 2024

హీరో సూర్య పుట్టినరోజు – ఫ్లెక్సీ కడుతూ కరెంట్ షాక్ తో ఇద్దరు అభిమానులు మృతి

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అభిమానులు నేడు ఫ్లెక్సీ కడుతూ మృతి చెందారు. నేడు సూర్య పుట్టినరోజును ఎంతో ఆనందంగా జరుపుకోవాలనుకున్న అభిమానులకు ఈ వార్త విషాదంలోకి నెట్టింది..

నరసరావుపేటలోని మోపువారిపాలెంలో నివసిస్తున్న సూర్య అభిమానులు అయిన నక్కా వెంకటేష్, పోలూరు సాయి సూర్య ఫ్లెక్సీలను కట్టాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా ఫ్లెక్సీలు కట్టడానికి కరెంట్ స్తంభం ఎక్కగా.. ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టడంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. దీంతో ఆ ఊరిలోనే కాదు సూర్య అభిమానులు మొత్తం శోక సంద్రంలో మునిగిపోయారు. ఆ ఇద్దరు కుర్రాళ్ళు డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నట్లు సమాచారం. ఎదిగి వచ్చిన కొడుకులు ఇలా కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో వారి తల్లిదండ్రులు గుండెలు అవిసేలా ఏడుస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement