Sunday, April 28, 2024

Vaikuntha Ekadashi: శ్రీ‌వారి ద‌ర్శ‌నం చేసుకున్న సుప్రీకోర్టు న్యాయ‌మూర్తి, హైకోర్టు సీజేఐ

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి హిమా కోహ్లి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీజేఐ ప్రశాంత్ కుమార్ మిశ్రా, సుప్రీంకోర్టు మాజీ సీజేఐ ఎన్వీ రమణ సహా పలువురు న్యాయమూర్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

ఇవాళ‌ ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శిస్తే సమస్త పుణ్యపరంపరలు చేకూరతాయని భక్తుల విశ్వాసం. అందుకే, తెల్లవారుజామునే స్వామివారి దర్శనార్థం ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. తిరుమలలో తెల్లవారు జాము నుంచే శ్రీవారి వైకుంఠ ద్వారాలు తెరచుకున్నాయి. ధనుర్మాసం నేపథ్యంలో ముందుగా తిరుప్పావై ప్రవచనాలు వినిపించడంతోపాటు శ్రీవారికి ఇతర కైంకర్యాలు పూర్తి చేశారు. టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. అటు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి ప్రముఖులు తరలి వచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement