Thursday, June 20, 2024

జేపీ న‌డ్డాతో సుజ‌నా చౌద‌రి భేటీ..

ఢిల్లీలో భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయ అధ్య‌క్షుడు జ‌గ‌త్ ప్ర‌కాశ్ న‌డ్డాతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన‌ బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు సుజ‌నా చౌద‌రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఈ భేటీలో భాగంగా పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నుల‌ను వేగ‌వంతం చేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జేపీ న‌డ్డాను కోరినట్టు సుజ‌నా చౌద‌రి సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అదే విధంగా అమ‌రావ‌తి నిర్మాణం, రైల్వే జోన్ ప‌నుల‌ను కూడా కేంద్ర ప్ర‌భుత్వం వేగ‌వంతం చేసేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని కూడా కోరినట్టు పేర్కొన్నారు.

అలాగే ఏపీలో రాజ‌కీయ ప‌రిస్థితులు, ఇత‌ర‌త్రా అభివృద్ధి ప‌నుల‌పై ఆయ‌న న‌డ్డాతో చ‌ర్చించారు. రాష్ట్రంలో బీజేపీ పురోగ‌మ‌నానికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌ను కూడా ఈ సంద‌ర్భంగా న‌డ్డాకు సుజ‌నా వివ‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement