Tuesday, April 23, 2024

Spl Story: చూసేవన్ని చూసి ఫోన్‌ హిస్టరీ క్లియర్​ చేస్తున్నారా.. అయినా దొరికిపోతారు తెలుసా?

స్మార్ట్​ఫోన్​ ఉపయోగంలోకి వచ్చాక అన్నీ బహిరంగమే అయిపోతున్నాయి. ప్రైవసీ, సేఫ్టీ అనేది లేకుండాపోతోంది. అయితే కొంతమంది ఫోన్​ ఉపయోగించిన తర్వాత యాప్ హిస్టరీ. కానీ, బ్రౌజింగ్​ హిస్టరీ కానీ క్లియర్ చేస్తే వాళ్లు ఏం సెర్చ్​ చేశారో ఎవరికీ తెలియదు అనే భ్రమలో ఉండిపోతారు. కానీ, కొన్న విషయాలు తెలుసుకునే టిప్ప్​, టెక్నిక్స్​ అందుబాటులోకి వచ్చేశాయి. ఫోన్‌లో చిన్న ట్రిక్ ఫాలో అయితే ఏ యాప్‌ను ఎంతసేపు ఉపయోగించారో కూడా తెలుసుకోవచ్చు. దానికోసం ఈ స్టోరీ చదవి తెలుసుకోండి..

ఏం చేయాలంటే..

  1. ముందుగా మొబైల్‌లో ‘కాలింగ్’ యాప్‌ను ఓపెన్ చేయండి.
  2. డయలర్‌కు వెళ్లి *#*#4636#*#* నెంబర్‌కు డయల్ చేయండి.
  3. ఇక అంతే ఫోన్‌లో మీరు ఏ యాప్స్‌ను ఎంత సేపు ఉపయోగించారో అక్కడ కనిపిస్తుంది.

ఇక.. ఫోన్ వేరేవారికి ఇస్తే కనుక వారు ఏ యాప్స్, ఏట్లాంటి కంటెంట్​ ఉపయోగించారో ఈజీగా తెలుసుకోవచ్చు. అయితే.. ఇందులో కేవలం యాప్ పేరు, అది ఉపయోగించిన సమయం మాత్రమే తెలుస్తుంది తప్ప, ఆ యాప్‌లో ఏం చూశారో తెలియదు. ఉదాహరణకు వారు ఫేస్‌బుక్ ఉపయోగించారనుకోండి. గంట సేపు ఫేస్ బుక్ ఉపయోగించినట్లు తెలుస్తుంది తప్ప, ఫేస్‌బుక్‌లో ఏం చూశారు? ఎవరితో చాట్ చేశారు? అనే విషయాలు మాత్రం తెలియవు.

అలాగే గూగుల్ క్రోమ్ ఉపయోగిస్తే… బ్రౌజర్ ఉపయోగించినట్లు తెలుస్తుంది తప్ప, అందులో వాళ్లు ఏం సెర్చ్ చేశారు? ఏం చూశారు? అనే విషయాలు తెలుసుకోవడం కష్టమే.. ఇక ఇంట్లో పిల్లలకు ఫోన్ ఇచ్చినప్పుడు వాళ్లు ఏ యాప్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు? అని కూడా ఈ ట్రిక్ ద్వారా తెలుసుకోవచ్చు. అయితే.. ఈ ట్రిక్ ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ ఫోన్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఆపిల్​ సంస్థ తయారు చేసే ఐఫోన్​లో ఈ టెక్నిక్​ పనిచేయదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement