Monday, May 6, 2024

బలపడిన అల్పపీడనం, బంగాళాఖాతంలో అలజడి

విశాఖపట్నం, ప్రభన్యూస్‌ ; బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది. తీవ్ర అల్పపీడనంగా మారి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఉత్తర వాయువ్య దిఘా అల్పపీడనం పయణిస్తోందని వెల్లడించారు. దీని ప్రభావంతో దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా జిల్లాల్లొ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర కోస్తా రాయల సీమ లోనూ పలు చోట్ల వర్సాలు కురుస్తాయని సూచించారు. ఉత్తర కోస్తాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాకాతంలో రుతుపవన కరెంట్‌ బలంగా ఉండడంతో ఉత్తర కోస్తాలో తీరం వెంబడి గంటకు 45నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని హెచ్ఛరించారు.

విశాఖపట్నం వాతావరణంకు సంబంధించి ఆకాశం మేఘావృతమై ఉండి కొన్ని చోట్ల పెద్ద ఎత్తున జల్లు, మరికొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసాయి. వాల్తేరులో అత్యధికంగా ఉష్టోగ్రత 29.8 డిగ్రీల సెల్సియస్‌, అత్యల్పంగా 24.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు చేసారు. వర్షపాతం 002.8 మిల్లిdమీటర్లు నమోదైంది. 083 శాతం గాలిలో తేమ ఉన్నట్లుగా గుర్తించారు. పౌర విమానయానకేంద్రంలో రికార్డైన అత్యధిక ఉష్ణోగ్రత 3.06 డిగ్రీ లసెల్సియస్‌, అత్యల్పంగా4 23.8 డిగ్రీ లసెల్సియస్‌గా నమోదైంది. 001.8 మిల్లిdమీటర్ల వర్షపాతం నమోదైంది,088 శాతంగా గాలిలో తేమ నమోదైంది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement