Sunday, May 5, 2024

AP: నేటి నుంచే పదో తరగతి పరీక్షలు.. అరగంట ఆలస్యమైనా అనుమతి!

ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది మొత్తం 6,22,537 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాబోతున్నారు. వీరిలో 3,02,474 మంది బాలికలు ఉన్నారు. పరీక్ష కోసం మొత్తం 3,776 కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు అరగంట ఆలస్యంగా కేంద్రానికి చేరుకున్నా సరైన కారణం చెబితే అనుమతించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. కోవిడ్ ప్రోటోకాల్‌ల మధ్య బుధవారం నుంచి రాష్ట్రంలో పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

కాగా, కరోనా నేపథ్యంలో రెండేళ్ల తర్వాత తొలిసారి పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే, ఈసారి ఏడు పేపర్లే ఉండనున్నాయి. పరీక్షల నేపథ్యంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. పరీక్ష కేంద్రానికి విద్యార్థులు అరగంట ఆలస్యంగా వచ్చినా అనుమతించాలని ఆదేశించింది. అలాగే, ఫీజు చెల్లిస్తేనే హాల్ టికెట్లు ఇస్తామంటూ ప్రైవేటు పాఠశాలలు.. విద్యార్థులపై ఒత్తిడి తీసుకొస్తున్న నేపథ్యంలో హాల్ టికెట్లను నేరుగా వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. అంతేకాదు, హాల్ టికెట్లపై హెడ్మాస్టర్ సంతకం లేకపోయినా అనుమతించాలని స్పష్టం చేసింది.

కోవిడ్ ప్రోటోకాల్‌ల కారణంగా పదో తరగతి పరీక్షా కేంద్రాల సంఖ్యను 3,776లకు పెంచింది. విద్యార్థుల కోసం తాగునీటి సౌకర్యం, ఏఎన్‌ఎంల ఏర్పాటు, కేంద్రాలకు ఉచిత రవాణా, కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కోవిడ్ ప్రోటోకాల్‌ల కారణంగా పదో తరగతి పరీక్షా కేంద్రాల సంఖ్యను 3,776లకు పెంచింది. విద్యార్థుల కోసం తాగునీటి సౌకర్యం, ఏఎన్‌ఎంల ఏర్పాటు, కేంద్రాలకు ఉచిత రవాణా, కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్షల సమయంలో అవకతవకలు జరగకుండా ఉండేందుకు 156 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, 292 సిట్టింగ్ స్క్వాడ్‌లను నియమించారు. కోవిడ్ మార్గదర్శకాల నేపథ్యంలో 16 మంది విద్యార్థులు మాత్రమే గదిలో కూర్చోవడానికి అనుమతించారు. పేపర్ మూల్యాంకనం మే 13 నుంచి 22 మధ్య జరుగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement