Saturday, October 12, 2024

Srisailam: విద్యుత్ షార్ట్ సర్క్యూట్.. 14 దుకాణాల దగ్ధం

కర్నూలు జిల్లా శ్రీశైలంలోని లలితాంబికా దుకాణంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎల్‌ బ్లాక్‌ సముదాయంలో 14 దుకాణాలకు మంటలు వ్యాపించాయి. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి దాటాక చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

అగ్నిప్రమాదం చాలా బాధాకరమైన విషయం.. బుడ్డా రాజశేఖర్ రెడ్డి
శ్రీశైలంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో దుకాణాలు దగ్ధంపై శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న హాయాంలో వ్యాపారస్తుల కోసం తాను ఎంతగానో శ్రమించి వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో లలితాంభిక షాపింగ్ కాంప్లెక్స్ ని నిర్మించడం జరిగిందన్నారు. అయితే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మార్కెట్ షాపులను తరలించే ప్రక్రియ సరిగా చేయలేదు. దుకాణాలు తరలింపు చేసేటప్పుడు కూడా వ్యాపారులకు అన్ని సౌకర్యాలతో పాటు ముఖ్యంగా భద్రత కూడా చేసిన తర్వాతనే తరలించాలని చెప్పాము. కానీ దేవస్థానం అధికారులు, ఎమ్మెల్యే ఎటువంటి ఏర్పాట్లు చేయకుండా వారిని బదిలీ చేశారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వం, దేవస్థానం అధికారుల నిర్లక్ష్యంగా కనిపిస్తుందన్నారు. కాబట్టి ప్రధానంగా ఈ ప్రభుత్వం ఈ దేవస్థానం అధికారులు చొరవ తీసుకొని ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిందో ఆ 14 షాపులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రధానంగా తాను డిమాండ్ చేస్తున్నానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement