Friday, May 17, 2024

పెండింగ్‌ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి.. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కు రూ.10 వేల కోట్లు : ద.మ. రైల్వే జీఎం సంజీవ్‌ కిశోర్‌

తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు రైల్వే ప్రాజెక్టులు వేగంగా పూర్తయ్యేలా కేంద్రం నిధులు కేటాయించింది. ఎప్పటి నుంచో డిమాండ్లు ఉన్న కొత్త రైల్వే లైన్లతోపాటు, ఆన్‌ గోయింగ్‌ ప్రాజెక్టులకూ పుష్కలమైన కేటాయింపులు జరిపింది. రెండు తెలుగు రాష్ట్రాలకూ కలిపి గతేడాది కన్నా దాదాపు 30 శాతం అధికంగా బడ్జెట్‌ ప్రకటించడంతో పలు రూట్లలో డబ్లింగ్‌, విద్యుదీకరణ పనులు వేగవంతం కానున్నాయి. వీటిలో తెలంగాణకు గతేడాది కన్నా 26 శాతం అధికంగా రూ. 3,048 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు గతేడాది కన్నా 21 శాతం పెంచి, రూ.7,032 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మౌలిక వసతుల కల్పన, కొత్త లైన్ల నిర్మాణం, డబ్లింగ్‌, విద్యుదీకరణ, ట్రాఫిక్‌ వసతుల పనులు చేపట్టనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర బడ్జెట్‌లో రైల్వేలకు కేటాయిం చిన నిధులలో దక్షిణ మధ్య రైల్వే (దమరై)కు అధిక నిధులు కేటాయిం చారని జీఎం సంజీవ్‌ కిశోర్‌ గురు వారం వర్చువల్‌గా జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు.

భద్రతకు ప్రాధాన్యం..

రైల్వే పరిధిలో లెవల్‌ క్రాసింగ్స్‌, బ్రిడ్జిలు, ఆర్‌వోబీ, ఆర్‌యూబీ, పనుల కోసం రూ.758 కోట్లు కేటాయించారు. ట్రాక్‌ పునరుద్ధరణ పనుల కోసం రూ.1040 కోట్లు, రైళ్లు ఢీకొనడాన్ని నివారించే ‘కవచ్‌’ వ్యవస్థ కోసం రూ.54 కోట్లు కేటాయించారు.

డబ్లింగ్‌, మూడో లైన్‌, బైపాస్‌ లైన్‌లపై దృష్టి..

విజయవాడ-గుడివాడ- మచిలీపట్నం- భీమవరం- నర్సాపూర్‌- నిడదవోలు డబ్లింగ్‌, విద్యుదీకరణ పనుల కోసం అత్యధికంగా రూ.1681 కోట్లు కేటాయించారు. 221 కిమీల పొడవైన డబ్లింగ్‌ ప్రాజె క్టులో రాష్ట్ర ప్రభుత్వం 50 శా తంభాగస్వా మ్యంకలిగి ఉం టుంది. ఇప్పటికే 109కి.మీల పనులు పూర్తయి, వేగంగా జరుగుతున్నాయి. విజయవాడ- గూడూరు మధ్య 288 కి.మీ మూడో లైన్‌ కోసం రూ. 1000 కోట్లు, గుంటూరు- గుంత కల్‌ మధ్య 401 కి.మీల డబ్లింగ్‌ ప్రాజెక్టు కోసం రూ.803 కోట్లు,కాజీ పేట- విజయ వాడ 3వ లైన్‌ ప్రాజెక్టుకు రూ. 592.5 కోట్లు-,కాజీపేట- బల్లార్షా 3వ లైన్‌ ప్రాజెక్టు కోసం రూ. 550.43 కోట్లు, సికింద్రాబాద్‌- మహబూ బ్‌నగర్‌ డబ్లింగ్‌, విద్యుదీకరణ ప్రాజెక్టు కోసం రూ.150 కోట్లు, గుత్తి- ధర్మవరం డబ్లింగ్‌ ప్రాజెక్టుకు రూ.100 కోట్లు-, అకోలా-డౌన్‌ డబ్లింగ్‌ ప్రాజెక్టు కోసం రూ.5 కోట్లు కేటాయించగా.. కొన్ని ప్రాజెక్టుల్లో పనులు ఇప్పటికే వేగంగా జరుగుతున్నాయి.

- Advertisement -

కొత్త లైన్లకు పచ్చ జెండా..

తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో డిమాండ్లున్న పలు కొత్త లైన్లకు కేంద్రం పచ్చ జెండా ఊపింది. నడికుడి- శ్రీకాళహస్తి 309 కి.మీల కొత్త రైల్వే ప్రాజెక్టు కోసం రూ. 1500 కోట్లు-, కోటిపల్లి- నర్సాపూర్‌ ప్రాజెక్టుకు కోసం రూ. 358 కోట్లు, కడప- బెంగళూరు నూతన రైల్వే లైన్‌ ప్రాజెక్టుకు (ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక) రూ. 289 కోట్లు, మునీరాబాద్‌- మహబూబ్‌ నగర్‌ ప్రాజెక్టు కోసం రూ. 289 కోట్లు-, భద్రాచలం- సత్తుపల్లి నూతన రైల్వే లైన్‌ ప్రాజెక్టు కోసం రూ. 163 కోట్లు, మనోహరాబాద్‌- కొత్తపల్లి నూతన రైల్వే లైన్‌ ప్రాజెక్టుకు రూ.160 కోట్లు, అక్కన్నపేట- మెదక్‌ మధ్య నూతన రైల్వే లైన్‌ ప్రాజెక్టుకు రూ.41 కోట్లు కేటాయించారు. వీటిలో కొన్ని ప్రాజెక్టులు ఆన్‌ గోయింగ్‌ కాగా.. రాష్ట్ర ప్రభుత్వం, రైల్వే భాగస్వామ్యంతో పనులు జరుగుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement