Wednesday, May 1, 2024

Lovely Robbery | రిసార్ట్​కి పిలిచిన గర్ల్​ఫ్రెండ్​.. బాత్​రూమ్​లో బందించి మొత్తం ఊడ్చేశారు!

బెంగళూరులో పనిచేస్తున్న ఓ సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​ని అతని దోస్తులే కిడ్నాప్​ చేసి దోపిడీకి పాల్పడ్డారు. అతని గర్ల్​ ఫ్రెండ్​ కూడా ఈ దోపిడీ గ్యాంగ్​లో https://www.prabhanews.com/కీలకంగా వ్యవహరించడం అందరినీ ఆశ్యర్యానికి గురిచేస్తోంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాంలిపు చర్యలు చేపట్టారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

బెంగళూరులో పనిచేస్తున్న ఓ 32 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌ని అతని స్నేహితురాలు, మరో ఐదుగురు కలిసి కిడ్నాప్ చేసి దోచుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. చిక్కబళ్లాపుర జిల్లాలోని నందిహిల్స్ సమీపంలోని ఓ రిసార్ట్ కు రావాలని, నీ రాక కోసం ఎదురుచూస్తున్నామని విజయ్‌సింగ్‌ అనే వ్యక్తిని అతని స్నేహితురాలు బావనారెడ్డి ఆహ్వానించారు. ఇక.. అక్కడికి వెళ్లిన విజయ్​సింగ్​ని బావనాతో పాటు మరో ఐదుగురు వ్యక్తులు మూడు రోజులపాటు గదిలో బంధించారు. అతడి నుంచి డబ్బులు వసూలు చేసేందుకు నానా రకాలుగా చిత్రహింసలకు గురిచేశారు.

నిందితులు విజయ్‌ను చిత్రహింసలకు గురిచేసి రూ.21 లక్షల రూపాయలను వేర్వేరు అకౌంట్లలోకి ట్రాన్స్​ఫర్​ చేయించుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా వారు అతని కారు, రెండు ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌లు, బంగారు చైన్​ని కూడా దోచుకున్నారు. ఇక.. ఎంతో నమ్మకంగా మెదిలిన  భావనా, మరో ఐదుగురు కలిసి విజయ్‌ను మూడు రోజుల పాటు QVC రిసార్ట్ లోని బాత్​రూమ్​లోనే బందించినట్టు తెలుస్తోంది.

- Advertisement -

ఇక.. విజయ్ సింగ్​ ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం వాసి కాగా, అతని స్నేహితురాలిగా నటించి దోపిడీకి పాల్పడ్డ యువతి భావన కూడా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రొద్దుటూరుకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. విజయ్ సింగ్ ఇచ్చిన కంప్లెయింట్​ మేరకు నందిహిల్స్ పోలీసులు ఐపీసీ సెక్షన్లు 506, 341, 504, 143, 149, 384, 323, 324 కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement