Monday, April 29, 2024

AP | యువగళానికి స్మాల్‌ బ్రేక్‌.. కోర్టుకు హాజ‌రుకానున్న లోకేష్‌

అమరావతి,ఆంధ్రప్రభ: యువగళం పాదయాత్రకు రెండ్రోజుల పాటు బ్రేక్‌ పడనుంది. ఇప్పటికే వైసీపీ సోషల్‌ మీడియా అసత్య ప్రచారంపై న్యాయపోరాటం చేస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఈ కేసుకు సంబంధించి మంగళగిరి కోర్టుకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో 13, 14వ తేదీల్లో పాదయాత్రను ఆయన వాయిదా వేసుకున్నారు. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత మరోనేత గుర్రంపాటి దేవేందర్‌ రెడ్డిపై ఆయన క్రిమినల్‌ కేసులు దాఖలు చేశారు. తనపైనా, తన కుటుంబంపైనా అసత్య ప్రచారం చేస్తున్నారని లోకేష్‌ కోర్టును ఆశ్రయించారు.

ఎన్టీఆర్‌ కుమార్తె ఉమా మహేశ్వరి ఆత్మహత్యకు సంబంధించి వైసీపీ సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేసిందని భూ వివాదంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా విష ప్రచారం చేశారని లోకేష్‌ గతంలోనే తన న్యాయవాది ద్వారా లీగల్‌ నోటీసులు ఇచ్చారు. ఈ వివాదానికి సంబంధించి వైసీపీ నేతలు ఇచ్చిన సర్వే నెంబర్లు ఫేక్‌గా తేలడంతో పాటు మరికొన్ని అంశాలపై లోకేష్‌ న్యాయ పోరాటం చేయాలని నిర్ణయం తీసుకుని మంగళగిరి కోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ కేసు సంబంధించి మంగళగిరి అడిషనల్‌ మెజిస్ట్రేట్‌కు లోకేష్‌ వాంగ్మూలం ఇవ్వాల్సి ఉండటంతో పాదయాత్రకు రెండ్రోజుల విరామం ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement