Saturday, December 7, 2024

Followup | పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. కారును ఢీకొన్న లారీ, ముగ్గురు మృతి

పల్నాడు, ప్రభన్యూస్‌ బ్యూరో: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడిన ఘటన పల్నాడు జిల్లా వినుకొండ సమీపంలోని మార్కాపురం రోడ్డులోని పసుపులేరు వాగు వంతెన సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐదుగురు వ్యక్తులు చీకటీగలపాలెం నుంచి వినుకొండకు కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో వీరందరూ ప్రయాణిస్తున్న కారు.. పల్నాడు జిల్లా వినుకొండ సమీపంలోని మార్కాపురం రోడ్డులోని పసుపులేరు వాగు వంతెన వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీ అదుపుతప్పి ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో శావల్యాపురం మండలం ముండ్రు వారిపాలెంకు చెందిన కె.నవీన్‌ (21), కనుమర్లపూడికి చెందిన కె.యోహోషు (21), వినుకొండకు చెందిన శివారెడ్డి (24) అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ఇద్దరిని స్థానికంగా ఉన్న మరో ప్రైవేటు ఆసుపత్రికితరలించారు.

ప్రమాదంలో మృతిచెందిన వారంతా యువకులు కావడంతో కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటాయి. బాధిత కుటు-ంబాలను వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడుతో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు పరామర్శించారు. బాధిత కుటు-ంబాలకు ప్రభుత్వం ద్వారా ప్రమాద బీమా వర్తించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కాగా మాజీ ఎమ్మెల్యే టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు కూడా ఆధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement