Saturday, June 1, 2024

దశాబ్దకాలంగా రింగ్‌ రోడ్డు పనులు పెండింగ్‌.. వాహనదారులకు తప్పని తిప్పలు

రాయచోటిటౌన్‌, (ప్రభ న్యూస్‌): రాయచోటి పట్టణంలో ట్రాఫిక్‌ సమస్యను నియంత్రించేందుకు వాహనదారులు సౌలభ్యం కోసం అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చొరవతో రాయచోటి పట్టణం చుట్టూ రింగు రోడ్డు ఏర్పాటు చేశారు. రాయచోటి మీదుగా కడప-బెంగళూరు, కర్నూలు, చిత్తూరు, కదిరి-నెల్లూరు తదితర పట్టణాలను కలుపుతూ ప్రయాణ సౌలభ్యం కోసం రాయచోటి ఎంఎల్‌ఏ శ్రీకాంత్‌రెడ్డి, అప్పటి సీఎం వైఎస్‌ఆర్‌ నుంచి సుమారు 17.1 కిమీ మేర రింగురోడ్డు పనులకు అనుమతులను తెప్పించుకున్నారు. సుమారు 16 కిలోమీటర్లు రింగు రోడ్డు పనులు పూర్తి చేసి దశాబ్ద కాలం అవుతున్నా మరో ఒక కిలోమీటర్‌ రింగు రోడ్డు పనులు అప్పటి నుంచి పెండింగ్‌ ఉండిపోయాయి. అందులో కొంత ఇటీవల కాలంలో రోడ్డు పనులు చేసినప్పటికీ ఇంకా 543 మీటర్లు మూడు ప్రాంతాలలో అలాగే ఉండిపోయింది.

అందులో ప్రధానంగా మదనపల్లె రింగు రోడ్డు సర్కిల్‌ వద్ద సుమారు మీటర్‌ లోతు గుంతలు ఏర్పడి వాహనాలు, బారీ వాహనాలు ఇరుక్కునే పరిస్థితి. బోల్తాపడే పరిస్థితి అక్కడ నెలకొంది. దీనికితోడు చెన్నముక్కపల్లె సర్కిల్‌ సమీపంలో మోటారు వాహనాల తనిఖీ అధికారి కార్యాలయం వద్ద మరింత పెద్ద గుంతలు ఏర్పడి వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేచేస్తున్నాయి. మరోవైపు వర్షాకాలం వస్తే రింగు రోడ్డులో ఉన్న లోతైన గుంతలు చెరువులను తలపిస్తుండటంతో వాహనాలు ఆ గుంతలలో రోజులు తరబడి ఇరుక్కునే పరిస్థితి నెలకొందని వాహనదారులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో నెలకొన్న రాయచోటి రింగు రోడ్డు పనులను పరిశీలించి పరిష్కారం చూపాలని వాహనదారులు, పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement