Sunday, May 5, 2024

వైద్య రంగంలో విప్లవం.. మరింత అప్ డేట్ అయిన ఆరోగ్యశ్రీ..

ప్ర‌భ‌న్యూస్ :గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు ఉన్న ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేసే దిశగా ముమ్మరమైన ప్రయత్నాలు చేస్తోంది ప్ర‌భుత్వం. అందులో భాగంగా వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పరిమితిని భారీగా పెంచి, పేదలందరికీ ఆరోగ్యరక్షగా నిలుస్తోంది. గతంలో రూ.రెండు లక్షల వార్షిక పరిమితి మాత్రమే ఉండగా.. దానిని రూ.ఐదు లక్షలకు పెంచి, పేదల వైద్యం పట్ల తమకున్న చిత్తశుద్ధిని పాలకులు చాటుకున్నారు. మరోవైపు గడిచిన రెండేళ్లలో ఆరోగ్యశ్రీలో అందించే చికిత్సలను కూడా భారీగా పెంచారు.

రాష్ట్రం కరోనాతో అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్పటికీ.. ప్రజారోగ్యం పట్ల నిబద్ధతతో ముందుకు సాగుతోంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా కరోనాను ప్రభుత్వ పథకాల పరిధిలోకి తీసుకురాకున్నప్పటికీ.. మన రాష్ట్రంలో మాత్రం ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చి ఇప్పటికే చికిత్సలు అందించారు. గడిచిన 29 నెలల్లో రూ. 4 వేల కోట్లను ఆరోగ్యశ్రీ పథకం కోసం ఖర్చు చేసింది. గతంలో మాదిరిగా కాకుండా నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు చెల్లింపులను కూడా వేగవంతం చేసింది. మూడు వారాల్లోపు ఆస్పత్రులకు బిల్లులన్నింటినీ చెల్లించే దిశగా ఆదేశాలిచ్చింది. తాజాగా అనేక వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ కూడా ఇచ్చింది.

అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య కేవలం 11 మా త్రమే ఉండగా.. కొత్తగా 16 వైద్య కళాశాలలను నిర్మించేందుకు సిద్ధమైంది. నాడు- నేడు ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖల్లో సమూల మార్పులు తీసుకువస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలన్న ధృడ సంకల్పంతో పీహెచ్‌సీల బలోపేతంపై దృష్టి పెట్టింది. ఆసుపత్రుల్లో అవసరమైన సిబ్బందిని నియమించడమే కాకుండా పూర్తిస్థాయిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన విధంగా మందులు ఉండేలా చర్యలు తీసుకుంటోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement