Sunday, April 28, 2024

Return Journey – పల్లెల నుంచి భాగ్య నగరానికి – హై వే లు కిటకిటా – టోల్ ప్లాజా ల వద్ద ట్రాఫిక్ జామ్ లు

సంక్రాంతి పండుగ 2024 అట్టహాసంగా ముగిసింది. భాగ్యనగరంలో స్థిరపడిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు స్వగ్రామాలకు తరలివెళ్లారు. బంధుమిత్రులతో కలిసి పండుగను సంతోషంగా జరుపుకున్నారు. ఈ సంక్రాంతి పండుగ మంగళవారం కనుమతో ముగిసింది. ఈ మూడు రోజులు హైదరాబాద్ నగరం బోసిపోయిందనే చెప్పాలి. ఇప్పుడు మరికొద్ది గంటల్లో భాగ్యనగరం కళకళలాడబోతోంది. ఇప్పటికే ఇళ్లకు వెళ్లిన వారంతా తిరిగి పయనమయ్యారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ వెళ్లే వారికి పోలీసులు కొన్ని సూచనలు చేశారు..

సూర్యాపేట, ఘాట్ కేసర్ టోల్ ప్లాజా వద్ద ఆంధ్రప్రదేశ్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే వాహనాల వల్ల భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడిందని పోలీసులు చెబుతున్నారు. ఘట్ కేసర్ టోల్ ప్లాజా వద్ద మొత్తం 12 బూతులకుగానూ 6 బూతులను హైదరాబాద్ వైపు తెరిచారు . ఇక 10 ఫాస్టాగ్ ఎంట్రీ ఉండగ రెండు బూతులు మాత్రమే నగదు చెల్లింపునకు కేటాయించారు. జనగామ, వరంగల్- నిజామాబాద్, సిద్దిపెట్, విజయవాడ, కర్నూల్ ఘట్ కేసర్ టోల్ ప్లాజా మీదుగా వాహనాలు హైదరాబాద్ చేరుకుంటున్నాయి. .

ఇక సూర్యపేట వద్ద రద్దీ ఎర్పడటంతో.. దీనిని నివారించి ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఉండేందుకు కార్లు, ఇతర వాహనాల్లో వెళ్లేవారు మరిపెడ, తొర్రూరు, జనగామ మార్గం మీదుగా లేదా వరంగల్ మీదుగా హైదరాబాద్ వెళ్లేందుకు ప్రయత్నించాలని సూచించారు. ఇలా చేయడం వల్ల ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఉండటమే కాకుండా జాతీయ రహదారిపై ట్రాఫిక్ కూడా తగ్గుతుంది.

సాధారణంగా ప్రతి సంవత్సరం జనవరిలో సంక్రాంతి సందర్భంగా ఇలాంటి దృశ్యాలు మనకు కనిపిస్తుంటాయి. మూడు రోజుల తర్వాత తిరిగి వచ్చే దారిలో టోల్ గేట్లు, జాతీయ రహదారులు కిటకిటలాడుతున్నాయి. మరో రెండు రోజుల పాటు వందలాది వాహనాలు టోల్ గేట్ల వద్ద బారులు తీరుతాయి. ముఖ్యంగా విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి వాహనాలతో కిక్కిరిసిపోతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement