Friday, May 3, 2024

Regional launguage – తెలుగులోనూ పారామిలటరీ దళాల రిక్రూట్మెంట్ పరీక్షలు

నిరుద్యోగ అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్ వంటి పారామిలటరీ దళాల్లో కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్షలు ఇక నుంచి తెలుగులోనే జరగనున్నాయి. ఫిబ్రవరి 20 నుంచి మార్చి 7 వరకు జరిగే ఈ పరీక్షలను తొలి సారిగా తెలుగు సహా మరో 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటించింది..

దేశవ్యాప్తంగా 128 నగరాల్లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పరీక్షకు సుమారు 48 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతున్నారని ఎంహెచ్ఏ ఒక ప్రకటనలో తెలిపింది. సాధారణంగా వీటిని ఇంగ్లీష్, హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లోనే జరుగుతుంటాయి. అయితే వాటిని ఇప్పటికే ఉన్న రెండు భాషలతో పాటు మరో ప్రాంతీయ 13 భాషల్లోనూ నిర్వహించాలని గత ఏడాది ఏప్రిల్ లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement