Friday, May 10, 2024

Cyclone Asani: ఏపీలో రెడ్ అలర్ట్

అసని తుఫాన్ మచిలీపట్నం-విశాఖపట్నం వైపు కదులుతోంది. అసని తుఫాన్ ఉత్తరాంధ్ర, ఒడిశా వైపు నుంచి దక్షిణం వైపు దిశను మార్చుకోవడంతో గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం, పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

తుపాను ప్రభావంతో ప్రకాశం, చీరాల, బాపట్ల ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.  ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోంది. విశాఖ తీరం వైపు వచ్చిన సమయంలో గంటకు 16 కి.మీ. వేగంతో ప్రయాణించి.. దిశ మారిన తర్వాత నెమ్మదించింది. ప్రస్తుతం గంటకు 10 కి.మీ. వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోంది. గురువారం ఉదయానికి వాయుగుండంగా బలహీనపడనుంది.

అసనీ తుఫాన్ ప్రభావంతో కాకినాడ-ఉప్పాడ బీచ్‌ రోడ్డును మూసివేశారు. రోడ్డు దెబ్బతినడంతో.. వాహనాల రాకపోకలను నియంత్రించడానికి రెండు చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. వాహనదారులు ఈ మార్గంలో వెళ్లకుండా చూస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement