Friday, May 17, 2024

ఏపీలో పలు జిల్లాలకు వర్ష సూచన

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం దక్షిణ చత్తీస్​గఢ్​పై ఆవరించి ఉంది. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తున మరో ఉపరితల ఆవర్తనం నెలకొని ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. బికనీర్, అజ్మీర్ నుంచి చత్తీస్ గఢ్ మీదుగా విశాఖ వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతోందని తెలిపింది. వీటి ప్రభావంతో ఏపీలో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలలో ఆకాశం మేఘావృతమై ఉందని పేర్కొంది. చాలాచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని, ఉత్తరాంధ్రలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర-దక్షిణ కోస్తాలోని ఉభయగోదావరి, కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. ఈ ప్రాంతాల్లో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రాయలసీమలో కర్నూలు, కడప జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement