Sunday, April 28, 2024

Weather Update | ఏపీ, తెలంగాణకు వర్ష సూచన..

గత కొద్దిరోజులుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఫిబ్రవరి దాటకముందే భానుడి భగభగలు పెరిగిపోయాయి. దీంతో ఎండవేడిమితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ నెలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఫిబ్రవరి 24 నుంచి 26 తేదీల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఆ తర్వాత మళ్లీ పొడి వాతావరణమే ఉంటుందని పేర్కొంది. శుక్రవారం కూడా సాధారణ వాతావరణ పరిస్థితులే ఉంటాయని అంచనా వేసింది.

ఇక ఏపీలోని ఉత్తర కోస్తా ప్రాంతంలో రేండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది అమరావతి వాతావరణ కేంద్రం.దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతంలో కూడా రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement