Wednesday, May 1, 2024

Lokesh: కూల్చిన వాళ్లతోనే ఎన్టీఆర్ విగ్రహం పెట్టిస్తాం

వైసీపీ ప్రభుత్వం ఓటమి భయంతోనే దుర్మార్గాలకు పాల్పడుతోందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. బాపట్ల మండలం భర్తీపూడిలో ఎన్టీఆర్ విగ్రహం కూల్చివేతపై లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ స్థానాన్ని ఎవరూ తొలగించలేరని చెప్పారు. ఆయన విగ్రహాలను కూల్చివేయడం దుర్మార్గమని ఆరోపించారు. విగ్రహాలను కూల్చివేతను తీవ్రంగా ఖండిస్తున్నామని, 3 నెలల్లో కూల్చిన వారితోనే, కూల్చిన చోటే మళ్లీ పెట్టిస్తామని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement