Wednesday, May 1, 2024

శ్రీశైలంలో శాస్త్రయుక్తంగా పూర్ణాహుతి.. రేప‌టితో ముగియ‌నున్న బ్ర‌హ్మోత్స‌వాలు

కర్నూలు: శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని పదవ రోజైన గురువారం ఉదయం స్వామి అమ్మవార్లకు విశేషపూజలు నిర్వహించారు. అనంతరం యాగశాలలో చండీశ్వర పూజతో పాటు రుద్రహోమం, చండీహోమం నిర్వహించారు. యాగ పూర్ణాహుతి, వసంతోత్సవం, అవబృథం, త్రిశూల స్నానం వంటివి నిర్వ‌హించారు. పూర్ణాహుతి కార్యక్రమంలో భాగంగా శాస్త్రోక్తంగా నారికేళాలు, పలు సుగంధ ద్రవ్యాలు, ముత్యం, పగడం, నూతన వస్త్రాలు వంటి ద్రవ్యాలను హోమగుండంలోకి ఆహుతిగా సమర్పించి యాగ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అనంతరం జరిగిన వసంతోత్సవంలో ఆలయ అర్చకులు, వేదపండితులు వసంతాన్ని (పసుపు , సున్నం కలిపిన మంత్ర పూరిత జలం) సమంత్రకంగా భక్తులపై ప్రోక్షించారు.

శుక్ర‌వారంతో ముగియనున్న బ్రహ్మోత్సవాలు
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శుక్రవారంతో ముగియనున్నాయి . ఈ ఉత్సవాల ముగింపులో భాగంగా శుక్ర‌వారం ఉదయం స్వామి, అమ్మవార్లకు విశేషపూజలు జరిపిస్తారు. సాయంకాలం స్వామివార్లకు అశ్వవాహనసేవ, ఆలయ ఉత్సవం ఉంటుంది. అనంతరం స్వామి, అమ్మవార్లకు పుష్పోత్సవం, శయనోత్సవం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement