కర్నూలు జిల్లా, పత్తికొండ పోలీస్ స్టేషన్ వద్ద ఓ వ్యక్తి ఉన్మాదిలా వ్యవహరించారు. రోడ్డుపై నిలిపిన బస్సు అద్దాలను ధ్వంసం చేయడమే.. కాకుండా పోలీస్ స్టేషన్ వద్ద ఆగిన కారు అద్దాలని ఇనుపరాట్లతో ధ్వంసం చేశాడు. అంతటితో ఆగక పోలీస్ స్టేషన్ లోకి దూసుకెళ్లి అక్కడి ద్విచక్ర వాహనాలను, ఫర్నిచర్ ని కూడా ధ్వంసం చేయడం గమనార్హం. ఒక్కసారిగా ఉన్మాది పెట్రోగి పోవడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. 10వ తరగతి, కళాశాల నుంచి వచ్చిన విద్యార్థులు, విద్యార్థినులు భయకంపితులయ్యారు. అతని తీరుపై కొందరు మండిపడగా, మరికొందరు విసిగిత్తారు. చివరకు పోలీసులు ఉన్మాదిని అదుపులోకి తీసుకుని స్టేషన్ లో బంధించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement