Friday, May 3, 2024

Protest – జ‌డ్పీ మీటింగ్ కు కలెక్ట‌ర్ గైర్హాజ‌ర్ – జగన్ ఇంటి ముందు నిరసనకు పేర్ని పిలుపు

మ‌చిలీప‌ట్నం – ఉమ్మడి కృష్ణా జడ్పీ సమావేశాలకు గైర్హాజరవుతున్న ఏలూరు జిల్లా కలెక్టర్ పై మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జడ్పీ మీటింగ్ లకు హాజరయ్యే ఉద్దేశం కలెక్టర్ కు లేదా..? అని ప్రశ్నించారు. ఒకవేళ మీటింగ్ లకు వచ్చే ఉద్దేశం లేకపోతే జడ్పీటీసీలందరితో కలిసి సీఎం జగన్ ఇంటి ముందు నిరసన తెలియజేస్తామని లేఖ రాయాలని జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక రాముకి సూచించారు.

దీనికి అంద‌రూ ఏక‌గ్రీవంగా ఆమోదం తెలిపారు.. కాగా, ఏలూరు క‌లెక్ట‌ర్ జ‌డ్పీస‌మావేశాల‌కు దూరంగా ఉంటున్నారు.. ఇప్ప‌టికే నాలుగు సార్లు ఆయ‌న గైర్హాజ‌రయ్యారు.. దీంతో పేర్ని నాని నిర‌స‌న‌కు పిలుపు ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement