Friday, May 10, 2024

విద్యుత్ పొదుపు – నెర‌వేరుతున్న జ‌గ‌న్ ల‌క్ష్యం

అమరావతి, ఆంధ్రప్రభ: ఇంధన పొదుపు, సామర్థ్య కార్యక్రమాల్లో జాతీయ స్థాయిలో నెంబర్‌ వన్‌ అవార్డును పొంది, భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును స్వీకరించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నేడు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఇంధన పొదుపు, సామర్థ్యం, సోలార్‌, విండ్‌ వంటి పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను ముమ్మ రంగా చేపట్టడం, ప్రధనంగా పరిశ్రమల్లో ఇంధన సామర్ధ్య కార్యక్రమాల అమలు వంటి అంశాలపై కీలక రాష్ట్రాలు సాధించిన విజయాలపై జర్మనీ ప్రభుత్వానికి చెందిన జీఐజెడ్‌ అధ్యయనం చేస్తోంది. అందులో మరీ ముఖ్యంగా బీఈఈ సహకారంతో జీఐజెడ్‌ ఆంధ్రప్రదేశ్‌పై ఈ అధ్యయనంలో ప్రత్యేక దృష్టి సారించింది. ఈ అధ్యయనం చేయడానికి జీఐజెడ్‌ ప్రముఖ కన్సల్టెన్సీ ప్రైస్‌ వాటర్‌ కూపర్స్‌ (పీడబ్ల్యుసీ)ను నియమించింది. పీడబ్ల్యుసీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రభాత్‌ నేతృత్వంలో ఒక బృందం గత రెండు రోజులుగా విజయవాడలో రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్‌ అధికారులతో, నెడ్‌ క్యాప్‌ అధికారులతో ఈ అధ్యయనంలో భాగంగా చర్చలు జరుపుతున్నారు. జీఐజెడ్‌ జర్మనీ చేపట్టే అధ్యయనం పారిశ్రామిక రంగంలో ఏపీతో పాటు-ఇతర ముఖ్య రాష్ట్రాలు చేపట్టిన ఇంధన సామర్ధ్య విధానాలను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఇంధన సామర్థ్యాన్ని ప్రోత్సహించడంలో రాష్ట్రం చేపట్టిన చర్యలను అర్థం చేసుకోవడం, అలాగే ఇతర రాష్ట్రాల్లో తగిన విధానాల అభివృద్ధిలో మద్దతుతు ఇవ్వడం లక్ష్యంగా జీఐజెడ్‌ ఈఅధ్యయనం చేస్తోంది. ఈఅధ్యయనం ‘పరిశ్రమలలోఇంధనసామర్థ్యం’ కార్యక్రమంలో భాగంగా ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలలో (స్టీల్‌) ఇంధన సామర్థ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతొ బీఈఈ, జీఐజెడ్‌ సంయుక్తంగా ఇటీ-వల ఈకార్యక్రమాన్ని ప్రారంభించాయి.

ఆర్ధిక వ్యవస్థపై తీవ్రత తగ్గింపునకు :
ఏపీలో అధ్యయనాన్ని నిర్వహించేందుకు ముందుకొచ్చిన బీఈఈ, జీఐజెడ్‌ జర్మనీలకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఆర్థిక వ్యవస్థపై ఇంధన తీవ్రతను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంధన పొదుపు, ఇంధన సామర్థ్యాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు ఎంతో ఆసక్తిగా ఉందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే విజయానంద్‌ అన్నారు. అలాగే పర్యావరణ పరిరక్షణకు మరియు రాష్ట్రంలో పెరుగుతున్న ఇంధనడిమాండ్‌ను కొంత మేర అందుకునేందుకు ఇంధన సామర్థ్యం దోహదపడుతుంది. ఇది అంతిమంగా విద్యుత్‌ వినియోగదారులకు నిరంతరాయ, నాణ్యమైన, నమ్మకమైన విద్యుత్‌ సరఫరాను అందించాలనే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డిల లక్ష్యాన్ని చేరుకోవడానికి సహాయపడుతుందని ఆయన అన్నారు. ఈఅధ్యయనాన్ని నిర్వహించడంకోసం బీఈఈ ద్వారా జీఐజెడ్‌ జర్మనీ చేత నియమించబడిన పీడబ్ల్యూసీ యొక్క సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రభాత్‌ విజయవాడను సందర్శించి, రాష్ట్ర ఇంధన సామ్యర్థ్య కార్యకలాపాలు, విజయాలను విస్తృతంగా పరిశీలించారు. ఇంధన సామ్యర్థ్య కార్యక్రమాలను అధ్యయనం చేస్తున్నప్పుడు, ఇంధన సంరక్షణ విభాగాలు, ఐఓటీ –టె-క్నాలజీ, ఎనర్జీఎషీయన్సీ పాలసీ, స్టాండ్‌ అలోన్‌ ఎస్డీఏ నమూనా, అవగాహనాకార్యక్రమాలు మొదలైనటువంటివి చేపట్టిన ఏపీఎస్‌ఈసీఎం ప్రధాన కార్యక్రమాలతో మేము చాలా సంతోషంగా ఉన్నామని ప్రభాత్‌ తెలిపారు.

ఎనర్జీ ఎఫీషియన్సీ పాలసీ
ఏపీఎస్‌ఈసీఎం రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ ఎనర్జీ కన్జర్వేషన్‌ అండ్‌ ఎనర్జీ ఎఫీషియన్సీ పాలసీని ప్రతిపాదించనుంది. ఈపాలసీ ద్వారా మొత్తం వార్షిక ఇంధన డిమాండ్‌ దాదాపు 65830 మిలియన్‌ యూనిట్లలో రూ.11779 కోట్ల విలువైన సుమారు 16875 మిలియన్‌ యూనిట్లు- (25.6 శాతం) ఆదా చేసేందుకు ప్రణాళిక రూపొందించాలనియోచిస్తోంది. తద్వారా దాదాపు 14.34 మిలియన్‌ టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతాయని అంచనా. ఏపీఎస్‌ఈసీఎం గత కొన్ని సంవత్సరాలుగా రూ.3800 కోట్ల విలువైన 5600 మిలియన్‌ యూనిట్లను వివిధ సెక్టార్లలో ఆదాచేయడంలో కీలక పాత్ర పోషించింది. ఏపీఎస్‌ఈసీఎం ఉత్తమ పద్ధతులను గుర్తిస్తూ, కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ అన్ని రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్‌ స్టాండ్‌ అలోన్‌ మోడల్‌ అనుసరించాలని లేఖరాశారు.

- Advertisement -

ఇంధన సెల్స్‌ ఏర్పాటుతో మంచి లాభాలు :
అన్ని ప్రభుత్వ విభాగాలలో ఇంధన సంరక్షణ (ఈసి) సెల్స్‌ను ఏర్పాటు-చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం జీఓ ఆర్టీ నెం. 89ని 2020 నవంబరు 5వ తేదీన జారీచేసింది. మరియు ఇంధన సామర్థ్య లక్ష్యాలను సాధించడం కోసం ప్రభుత్వ విభాగాలలో ఇంధన పరిరక్షణ సెల్స్‌ను ఏర్పాటు- చేయడానికి జీవో జారీ చేసిన ఏ-కైక-రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. పెర్ఫార్మ్‌, అచీవ్‌ అండ్‌ ట్రేడ్‌ (పాట్‌) స్కీమ్‌ అమలులో ఏపీఎస్‌ఈసీఎం అత్యుత్తమ స్టేట్‌ డిజిగ్నేటెడ్‌ ఏజెన్సీలలో ఒకటి. ఇది మొత్తం 5600 మిలియన్‌ యూనిట్ల పొదుపులో పారిశ్రామిక రంగంలో ఒక్క పాట్‌ ద్వారా రూ.2394 కోట్ల విలువైన దాదాపు 3430 ఎంయూ ఆదా చేసింది. డెమోనిస్ట్రేషన్‌ ఆఫ్‌ ఎనర్జీఎఫీషియన్సీ ప్రాజెక్ట్‌ (డీఈఈపీ) , సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో ఎనర్జీ ఎఫీషియన్సీ కార్యక్రమాలు ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నుండి రూ. 50 కోట్ల నుంచి రూ. 100 కోట్లు -గ్రాంట్లను పొందే అవకాశాన్ని కూడా ఏపీఎస్‌ఈసీఎం అన్వేషిస్తోంది.

విద్యుత్‌ వినియోగదారులను బాగస్వామ్యులను చేస్తూ :
ప్రభుత్వ విభాగాలు, ప్రైవేట్‌ సంస్థలు, విద్యుత్‌ వినియోగదారులతో సహా అందరిని భాగస్వాములుగా చేసి, ఇంధన పొదుపు, ఇంధన సామర్థ్య జీవన విధానాన్ని అనుసరించడానికి వారిని ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపడం, ఆర్థిక కార్యకలాపాలను పెంచడం, పర్యావరణ ప్రయోజనాలతోపాటు -ఇంధన వినియోగం మరియు విద్యుత్‌ బిల్లులను తగ్గించడం ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ప్రయోజనం చేకూర్చే దిశగా ఏపీఎస్‌ఈసీఎం అడుగులు వేస్తోంది. ఎనర్జీ కన్జర్వేషన్‌ – ఎనర్జీ ఎఫీషియన్సీ పాలసీ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇంధన పొదుపు, సామర్ధ్య చర్యలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టు-కుంది. ఇది రాష్ట్రఆర్థిక వ్యవస్థను పెంపొందించడానికి మరియు వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ఇంధన భద్రతను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఈపాలసీ గృహ, పరిశ్రమలు వాణిజ్యం, వ్యవసాయం, మున్సిపాలిటీ-మరియు రవాణా రంగాలకు సంబంధించి రాష్ట్రంలో ఇంధన సామర్థ్యం, ఇంధన సంరక్షణ చర్యలను సమర్థవంతంగా అమలు చేయడానికి ఉద్దేశించబడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement