Friday, May 3, 2024

Flash: దొంగగా మారిన పోలీసు.. అడ్డంగా దొరికిపోయాడు

దొంగలను పట్టుకోవాల్సిన పోలీసే దొంగగా మారిపోయాడు. చెడు వ్యసనాలకు బానిసై చోరీకి ప్రయత్నించి దొరికిపోయాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా కైకలూరులో జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా ఉండి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణ కొన్నాళ్లుగా చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు. కైకలూరులో ఓ దుకాణంలోకి వెళ్లిన ఆయన.. షాపు నిర్వాహకురాలిని బెదిరించి ఆమె మెడలో గొలుసు లాక్కునే ప్రయత్నం చేశాడు. మహిళ కేకలు వేయడంతో అక్కడున్న యువకులు కానిస్టేబుల్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కానిస్టేబుల్‌తోపాటు మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement