Sunday, April 28, 2024

పోలవరం నిర్వాసితుల సమస్యలపై ప్రతిపక్ష నేతల దీక్ష

పోలవరం ప్రాజెక్టు పరిధిలోని నిర్వాసితుల సమస్యలు తీర్చాలంటూ ప్రతిపక్ష నేతలు విజయవాడలో నిరసన దీక్ష చేపట్టారు. పునరావాసం కల్పించకుండా నిర్వాసితులను ఎలా తరలిస్తారని ప్రశ్నింస్తూ నిరసనలు చేపట్టారు. పోలవరం నిర్వాసితుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలో టీడీపీ, సీపీఐ, సీపీఎం, రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ దీక్షలో పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ, పోలవరం నిర్వాసితులను గ్రామాల నుంచి తరిమేస్తున్నారని ఆరోపించారు. నిర్వాసితుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయని విమర్శించారు. నిర్వాసితులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సీపీఎం అగ్రనేత మధు స్పందిస్తూ, 15 రోజల్లోగా నిర్వాసితుల సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 7న ముంపు మండలాల్లో నిరసన దీక్షలు చేపడుతున్నట్టు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: మ్యాచ్ మధ్యలో గర్ల్ ఫ్రెండ్ కు ప్రపోజ్..

Advertisement

తాజా వార్తలు

Advertisement