Friday, May 10, 2024

AP: ఎవ‌రో సుబ్బారెడ్డి వ‌స్తే.. ఊరుకుంటారా..? మంత్రి ధ‌ర్మాన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

శ్రీకాకుళం, ఫిబ్రవరి 26: ఎవరో సుబ్బారెడ్డి అనే వ్యక్తి శ్రీకాకుళం జిల్లాలో భూములు కాజేసేందుకు తనతో మాట్లాడాడని, అయితే అలా కుదరదు.. తంతాను అని తాను స్పష్టం చేశానని, ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారు ఈ జిల్లా భూములను ఆస్తులను తీసుకోవడమేమిటిని ఇటువంటి అవినీతికి ఆస్కారం ఇవ్వకూడదని రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం పట్టణంలో ఆదివారం రాత్రి కొంతమంది కళింగ వైశ్యులు వైసీపీలో చేరిన సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ… అవినీతి లేని రాజకీయాలు ఉండాలన్నారు. తనకు రాజకీయాలు శాశ్వతం కాదని ఓడినా, గెలిచినా మీ స్నేహితుడనేనంటూ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు.

రాజకీయాలంటే కేవలం భౌతికంగా కన్పించే అంశాలే కాదు.. ప్రశాంత జీవనానికి కావాల్సిన అంశాలను చేకూర్చడమేనని అన్నారు. తాను అధికారంలో ఉన్నా… లేకున్నా మీ స్నేహితుడిగానే ఉంటానని అన్నారు. తాను విశ్రాంతి కావాలన్నా…
సీఎం జగన్‌ పోటీ చేయాలని చెప్పారని, ఆయన మాటకు కట్టుబడి ఈసారి ఎన్నికల బరిలో ఉన్నానని పునరుద్ఘాటించారు.
ఇదే త‌నకు చివరి ఎన్నికలు అని ధర్మాన స్పష్టం చేశారు. కాగా ధర్మాన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో కూడా సంచలనం అవుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో భూములు కాజేసేందుకు వచ్చిన ఆ సుబ్బారెడ్డి ఎవరన్న దానిపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఆ సుబ్బారెడ్డి ఎవరు అన్నది కూడా ధర్మాన స్పష్టంగా చెప్పలేదు.. ఆయన ముఖం కూడా చూడలేదని అన్నారు. ఆ సుబ్బారెడ్డి ఎవరో అన్నదానిపై ప్రతిపక్షాలు ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement