Thursday, May 2, 2024

No Flying Zone – మ‌రోసారి తిరుమ‌ల‌గిరుల‌పై విమాన విహారం – మండిప‌డుతున్న భ‌క్త‌జ‌నం

తిరుమ‌ల – ఇటీవల కాలంలో తిరుమల కొండపై విమానాలు వెళ్లిన ఘటనలు పలుమార్లు చోటుచేసుకున్నాయి. ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం శ్రీవారి ఆలయం, పరిసరాలపై విమానాలు ప్రయాణించడం నిషిద్ధం. అయితే, గత కొన్ని నెలల వ్యవధిలోనే పలుమార్లు వెంకన్న ఆలయంపై విమానాలు వెళ్లడం కలకలం సృష్టించింది.

తాజాగా, మరోసారి ఆగమశాస్త్ర నిబంధనలకు తూట్లు పొడిచేలా, రెండు విమానాలు తిరుమల గగనతలంలోకి ప్రవేశించాయి. ఓ విమానం ఆలయ గోపురం, గొల్ల మంటపానికి మధ్యలో ప్రయాణించింది. మరో విమానం ఆలయ సమీపంలో విహారించింది..దీంతో భ‌క్తుల మండిప‌డుతున్నారు.. తిరుమల క్షేత్రంపైకి విమానాలు రాకూడని టీటీడీ చెబుతున్నా కేంద్ర విమానయాన శాఖ పట్టించుకున్న దాఖలాలు కనిపించడంలేదు. దీనిపై మ‌రోసారి తిరుమ‌ల అధికారులు విమాన‌యాన మంత్రిత్వ శాఖ‌కు లేఖ రాయ‌నున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement