Saturday, April 27, 2024

రేప‌టి నుంచే శ్రీ కామాక్షి తాయి సంగమేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు

మనుబోలు మండలం లోని బద్దెవోలు క్రాస్ రోడ్డు సమీపంలోని కండలేరు తీరం లో వెలసి వున్న శ్రీకామాక్షి తాయి సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుండి ప్రారంభం కానున్నవి. ఇందులో భాగం గా 9న అంకురార్పణ, ద్వజారోహణ, 10న సప్రోత్సవం 11న రావణ సేవను నిర్వహిస్తారు. అలాగే 12న నంది సేవ చేస్తారు. 13వ తేది రాత్రి కన్నుల పండువ గా తేరు మహోత్సవాన్ని నిర్వహిస్తా రు. 14న అత్యంత వైభవంగా శ్రీస్వామి వారికి కళ్యాణమహోత్సవాన్ని నిర్వ హిస్తారు. అదే రోజు రాత్రి తేరు పై నవ దంపతులను కూర్చోబెట్టి వివిధ రకాల పూల తోను విద్యుత్ దీపాకాంతుల తోను , మేళతాళాలు బాణాసం చా మోతల మధ్య భక్తులు భుజాలపై మోసుకొంటూ మనుబోలుకి తీసుకొని వస్తారు. 15న పారువేట 16న వసంతసేవ, 17న ఏకాంతసేవ తో ఈ బ్రహ్మాత్సవాలు పూర్తి అవుతాయి.ఈ ఆలయాన్ని పరశురాముడు తన శాపవిమోచనం పోవడానికి కట్టించాడనే చెప్పుతారు. ఏళ్ల నాటి శని వుం టే ఈ గుడిలో స్వామి దర్శనంతో తొలగిపోతుందని , అలాగే పిల్లలు పుట్టుక లేదని భాద పడే వారు ఇక్కడ ఉత్సవాల సమయంలో కొడిముద్ద ను తిని ఉపవాసం వుండే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం.

Advertisement

తాజా వార్తలు

Advertisement