Monday, July 22, 2024

Tribute – అంబేడ్కర్‌ ఆశయాలు ఆచరణలోకి తీసుకురావడమే ధ్యేయం – చంద్రబాబు

అమరావతి : దేశ ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంతో పాటు సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమ న్యాయం చేకూర్చేందుకు కృషిచేసిన మహనీయుడు అంబేడ్కర్‌ అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు..

అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అంబేడ్కర్‌ ఆదర్శాలు, ఆశయాలను ఆచరణలోకి తీసుకురావడమే ఆయనకు అందించే అసలైన నివాళి అని పేర్కొన్నారు.

అంబేడ్కర్‌ సేవలు మరువలేనివి: లోకేశ్‌

- Advertisement -

రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ఆ మహనీయుని సేవలు స్మరిస్తూ నివాళులర్పించినట్లు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా పోస్టు చేశారు. భారత్‌ను ప్రపంచంలోని అతి పెద్ద లౌకిక, గణతంత్ర, ప్రజాస్వామ్య దేశంగా తీర్చిదిద్దడంలో ఆయన కృషి మరువలేనిదని కొనియాడారు. అంబేడ్కర్‌ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు

Advertisement

తాజా వార్తలు

Advertisement